Begin typing your search above and press return to search.

కొత్త కన్ఫ్యూజన్.. రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై?

By:  Tupaki Desk   |   17 April 2020 3:15 AM GMT
కొత్త కన్ఫ్యూజన్.. రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై?
X
ఆ మధ్య వరకు కరుడుగట్టిన టీడీపీ నేతగా పేరున్న వల్లభనేని వంశీ.. 2019 ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన మాటలో వచ్చిన మార్పునకు షాక్ తినని తెలుగు తమ్ముళ్లు లేరనే చెప్పాలి. గన్నవరం నుంచి పోటీ చేసిన ఆయన.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ హోరుతో కొమ్ములు తిరిగిన టీడీపీ నేతలంతా కొట్టుకుపోతే.. వల్లభవనేని వంశీ విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీపై విమర్శలు చేయటమే కాదు.. బాబు కుమారుడు కమ్ మాజీ మంత్రి లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సైకిల్ దిగేసి.. ఫ్యాన్ గూటికి వెళ్లి పోతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయినప్పటికి పార్టీ మారలేదు. కాకుంటే.. సీఎం జగన్ కు తన మద్దతు తెలియజేస్తూ.. ప్రభుత్వ విధానాల్ని సమర్థిస్తున్నారు. తాజాగా ఆయన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఒకటి రాజకీయ దుమారంగా మారింది. గతంలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లుగా చెప్పిన వల్లభనేని వంశీ.. తాజాగా తన పద్నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానంలో తన కష్ట సుఖాలతో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలుగా పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వంశీ.. తాజాగా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. అయితే.. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? లేక తన రాజకీయాల్లోకి వచ్చి పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వేళ.. తనను అభిమానించి.. ఆదరించిన వారికి థ్యాంక్స్ చెప్పే ఉద్దేశంతో పోస్టు పెట్టారా? అన్నది క్వశ్చన్ గా మారింది. తాజా పోస్టుతో వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం సాగుతోంది.

ఏమైనా ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన మెసేజ్ తో క్లారిటీ కన్నా కన్ఫ్యూజనే ఎక్కువగా ఉందని చెప్పాలి. వణికించే కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తనను ఎన్నుకున్న ప్రజలకు అండగా ఉండాల్సిన వేళ.. ఆ విషయాన్ని వదిలేసి.. ఈ పోస్టులేంది వంశీ అనే వారు లేకపోలేదు. ఏమైనా.. తన పోస్టు మర్మం ఏమిటన్న విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.