Begin typing your search above and press return to search.

దేశాన్ని న‌డిపించే డ‌బుల్ ఇంజ‌న్లు.. మోడీ-ఈడీలేనా..?

By:  Tupaki Desk   |   25 July 2022 4:14 AM GMT
దేశాన్ని న‌డిపించే డ‌బుల్ ఇంజ‌న్లు.. మోడీ-ఈడీలేనా..?
X
బీజేపీ నాయ‌కులు.. ముఖ్యంగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌ర‌చుగా.. ఒక మాట చెబుతూ ఉంటారు. కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉంది.. సో.. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే.. డ‌బుల్ ఇంజ‌న్‌తో దూసుకు పోవ డం ఖాయ‌మ‌ని చెబుతుంటారు. అయితే.. డ‌బుల్ ఇంజ‌న్‌.. అంటే.. నిజానికి మోడీ చెబుతున్న‌ట్టు.. రాష్ట్రా ల్లోనూ బీజేపీ స‌ర్కారేనా..? లేక పోతే.. ఇంకేదైనా ఉందా? అంటే.. అదే 'ఈడీ' అంటున్నారు ప‌రిశీల కులు. ఎందుకంటే.. రాష్ట్రాల‌ను త‌న దారిలోకి తెచ్చుకునేందుకు ఈడీని ప్ర‌యోగిస్తున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండే ప్ర‌భుత్వాల విష‌యంలో ఒక విధంగా.. అనుకూలంగా లేని ప్ర‌భు త్వాల విష‌యంలో మ‌రోలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హారాష్ట్ర లో త‌మ అనుకూల ప‌రిస్థితి వ‌చ్చే వ‌ర‌కు కూడా కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ను రంగంలోకి దిం చింది.

శివ‌సే న ఎంపీలు.. కీల‌క నాయ‌కుల ఇళ్ల‌పై దాడులు చేసి.. వారిని లోబ‌రుచుకునే ప్ర‌య‌త్నం చేశారు. తీరా త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. కానీ.. ఈడీ దాడులు త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు.

అంటే.. దీనిని బ‌ట్టి రాష్ట్రాలు.. త‌మకు అనుకూలంగా ఉండాల‌నే వుద్దేశాన్ని మోడీ చెప్ప‌క‌నే చెబుతున్నా రు. అంతేకాదు.. త‌మ మాట విన‌ని రాష్ట్రాల‌పై ఈడీ ప్ర‌యోగాలుచేస్తూ.. త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిం చేలా చేస్తున్నారు.

మ‌రి దీనిని బ‌ట్టి రాష్ట్రాల్లో ఈడీ ప్ర‌యోగాన్ని సెకండ్ ఇంజ‌న్‌గా భావించాల్సి ఉంటుం దా? తాజాగా తెలంగాణ‌లోనూ ఈడీ దాడులు ఖాయ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ఇక్క‌డ కేసీ ఆర్ స‌ర్కారు కేంద్రంతో ఢీ అంటే.. డీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ కూడా ఈడీ ప్ర‌యోగం త‌ప్ప‌ద‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇదే విష‌యంపై మంత్రి కేటీఆర్‌స్పందించారు. డ‌బుల్ ఇంజ‌న్ అంటే.. మోడీ-ఈడీయేన‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రం సంధిం చారు. మొత్తానికి బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజ‌న్ అంటే.. ఇదేనా? అనేలా వ్యాఖ్య‌లు.. విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. గ‌తంలో కాంగ్రెస్ కూడా త‌మ మాట విన‌ని ప్ర‌భుత్వాలు.. పార్టీల‌పై సీబీఐ, ఈడీల‌ను ఉసిగొలిపేద‌నే విమ‌ర్శ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.