Begin typing your search above and press return to search.

మోడీ ఆదర్శాలు ఎంపీలకు వర్తించవా !

By:  Tupaki Desk   |   24 Nov 2019 3:06 AM GMT
మోడీ ఆదర్శాలు ఎంపీలకు వర్తించవా !
X
దేశ ప్రధాని మోడీ  అధికారం చేపట్టినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టారు. దేశాన్ని శుభ్రంగా ఉంచాలంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఈ తరుణం లోనే వరుసగా రెండోసారి కూడా కేంద్రం లో సంపూర్ణ మెజారిటీ తో అధికారంలోకి వచ్చారు. ఇక ప్రధాని మోడీ ..చాలా సందర్భాలలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు , ఇతర నేతలు , కార్యకర్తలు కూడా చాలా సింపుల్ గా ఉండాలని , సాధారణమైన జీవితాన్నే గడపాలని చెప్తుంటారు. అలాగే మంత్రులైన , ఎంపీలైనా కూడా స్పెషల్ ఫ్లైట్స్ లో కాకుండా , సాధారణ ప్రజలలాగే సాధారణ ప్రయాణం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ నియమాన్ని బీజేపీ పార్టీ కి చెందిన ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పారు.

కాని , ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న కొన్ని కార్యక్రమాలని చూస్తుంటే..మోడీ చెప్పిన ఆదర్శాలు ..కేవలం సాధారణ ప్రజలకి మాత్రమే వర్తిస్తాయి .. బీజేపీ కి చెందిన ఎంపీలకు కాదు అని అర్థమౌతుంది. తమ పార్టీ ఎంపీలని సైతం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లొద్దు అని మోడీ చెప్తే ..ఇప్పుడు తాజాగా ఒక ఎంపీ తన కుమారుడి నిచ్చితార్థం కోసం ఏకంగా పార్టీ ఎంపీల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 స్పెషల్ ఫ్లైట్స్ నే బుక్ చేసాడు. ఇది మోడీ ఆదర్శం అంటే ..ఏదైనా చెప్పే ముందు ..ఫస్ట్ మనం పాటించి ఎదుటివారికి చెప్పాలి. ఇంతకీ కొడుకు నిచ్చితార్దానికే 15 స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసిన ఆ ఎంపీ ఎవరా అని అనుకుంటున్నారా..అయన మరెవరో కాదు ..ఎంపీ సీఎం రమేష్. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో.. సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం దుబాయ్‌ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు భారీగా రాజకీయ ప్రాముక్యలు తరలి వెళ్తున్నారు. రస్ ఆల్ ఖైమా అనే దేశంలో.. వాల్ డార్ఫ్ ఆస్టోరియాలో.. రిత్విక్, పూజాల నిచ్చితార్థం చాలా గ్రాండ్ గా జరగనుంది. మొత్తంగా మోడీ ఆదర్శాలు ఆ పార్టీ ఎంపీలే తుంగలో తొక్కుతుంటే ..ఇక మిగతావారు పాటిస్తారని నమ్మడం మన మూర్కత్వమే అవుతుంది.