Begin typing your search above and press return to search.
మోడీ ఇమేజ్ మసకబారిందా..?
By: Tupaki Desk | 27 April 2021 10:39 AM GMTగుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేకుండా సక్సెస్ సాధించిన నరేంద్ర మోడీని బీజేపీ నాయకులు కేంద్రానికి తీసుకొచ్చారు. ఏ ఒక్క కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా నేరుగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో ఆయనకు గుజరాత్ వరకున్న ఇమేజ్ దేశం మొత్తం తెలిసిపోవడంతో ఆయన ప్రధానమంత్రిగా దేశానికి అవసరమని దేశ ప్రజలంతా ఓట్లేసి గెలిపించారు. దీంతో 2014లో బీజేపీ అధికారంలో రాగలిగింది. ప్రపంచవ్యాప్తంగా మోడీ పేరు మారుమోగింది. ఒక సామాన్యుడు, చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యాడని అందరూ వేయినోళ్ల పొగిడారు. ప్రధానిగా నరేంద్రమోడీ పీఠంపై కూర్చున్నారు. అప్పటి నుంచి అనేక పథకాలతో ముందుకెళ్తున్న మోడీ తిరుగులేని నాయకుడిగా బీజేపీలో ఇప్పుడు అవతరించారు.
2019లో రాహుల్ వర్సెస్ మోడీ అని ప్రచారం జరిగినా మొత్తానికి మోడీనే మరోసారి విజయం వరించింది. రాహుల్ సామర్థ్యాలపై నమ్మకం లేని ప్రజలు మోడీకే మరోసారి చాన్స్ ఇచ్చారు. దీంతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి కరోనా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనుకున్నారు. కానీ లాక్ డౌన్ పేరిట ముందే మేలుకొని అందరినీ ఇంట్లో పెట్టి కరోనాను కట్టడి చేసినట్టుగా మోడీ విజయాన్ని చాటుకున్నారు. కానీ మరోవైపు ఆర్థిక వ్యవస్థను మాత్రం కుప్పకూల్చారు.. సెప్టెంబర్ ఫిబ్రవరి మధ్యలో కరోనా కేసులు కూడా తగ్గడంతో కరోనాపై భారత్ విజయం సాధించిందని ప్రపంచంలోని దేశాలు ప్రశంసలు కురిపించాయి. మొదటి కరోనా వేవ్ నుంచి దేశాన్ని కాపాడిన మోడీ ప్రపంచదేశాల్లో హీరో అయిపోయాడు. అవన్నీ చూసిన మోడీ హంగోవర్ అయినట్లయిందని కొందరు అంటున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ ను బాగానే అరికట్టిన మోడీ సెకండ్ వేవ్ పై ఎందుకు ఆలోచించలేదోనని హెల్త్, పొలిటికల్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి ఇండియా విలవిలలాడిపోతోంది. అయితే బీజేపీ నాయకులు మాత్రం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి మొత్తం మోడీ మీదకు నెట్టెస్తున్నారని అంటున్నారు. కానీ మనమీద ఆధారపడిన నేపాల్ దేశం కూడా తమకు తోచిన సాయం భారత్ కు చేస్తానని ప్రకటిస్తోంది. దీంతో ప్రపంచ పటంలో ఇండియా మసకబారినట్లు కనిపిస్తుందని క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే విపత్తు వచ్చినప్పుడు కలిసికట్టుగా పోరాడాలని, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పోతే సమస్య ఎక్కువవుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇండియా త్వరగా కోలుకునేలా..కోరుకోవాలని ఇలా విమర్శలు చేస్తే అందరికీ నష్టమేనని అంటున్నారు. దీంతో ఇండియా కరోనా కోరల్లో నుంచి ఎన్నడు బయటపడుతుందోనని అందరూ భయపడుతున్నారు. కానీ సెకండ్ వేవ్ తో మోడీ ఇమేజ్ మాత్రం మసకబారిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.