Begin typing your search above and press return to search.
అద్వానీకి భారతరత్న?
By: Tupaki Desk | 19 July 2017 4:29 AM GMTరాష్ట్రపతి పదవికి అర్హుడైన నేతగా ప్రచారం జరిగిన అనంతరం బెర్తు దక్కకపోయిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తులు వస్తున్నాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమై భారత్ రత్నతో ఆయన్ను సత్కరించాలని ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నదని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ప్రారంభమైన మొదటి నుంచి రేసులో అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒక దశలో ఆయన పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. ఒకనాడు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఎల్‌కే అద్వానీకి గురుదక్షిణ కింద రాష్ట్రపతి పదవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టబెడతారని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఆ తదుపరి క్రమంలో బాబ్రీ మసీదు కూల్చివేత తెరమీదకు రావడం, అద్వానీ భాగస్వామ్యంంపై అభియోగాలు...దళిత నేతను రాష్ట్రపతి చేయాలనే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అద్వానీ పేరు వెనక్కుపోయింది. అయితే కారణాలు ఏమైనప్పటికీ తనకు కీలక పదవి దక్కకపోవడంపై అద్వానీ కినుక వహించారనే వార్తల నేపథ్యంలో తాజాగా ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.