Begin typing your search above and press return to search.
మోడీ దోస్తీ ‘భస్మాసుర’ హస్తమేనా?
By: Tupaki Desk | 9 July 2022 1:30 AM GMTదేశంలో బీజేపీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన మోడీది లక్కీ హ్యాండ్ అని ఆ పార్టీ నేతలు నమ్ముతుంటారు.. ఎందుకంటే మోడీ చేపట్టిన ఏ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోలేదు కాబట్టి. కానీ ఆయనతో దోస్తీ చేసిన వారికి మాత్రం అది భస్మాసుర హస్తంగానే మారింది. గత అమెరికా ఎన్నికలకు ముందు మోడీ చేతిలో చేయి వేసి మరీ ఒక పెద్ద స్టేడియంలో ఎన్నికల ప్రచారంలో మొత్తం కలియతిరిగాడు మన డొనాల్డ్ ట్రంప్.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో అగచాట్లు పడుతున్నాడు.
ఇక మన శత్రుదేశం పాకిస్తాన్ ప్రధానిపై కూడా మోడీ చల్లని చూపు పడింది. ట్రంప్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి పోగొట్టుకోవడానికి కూడా మోడీనే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇమ్రాన్ పుట్టినరోజు సందర్భంగా మోడీ.. ‘గుజరాతీ రసగుల్లా సహా కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ’ ప్రత్యేకంగా పాక్ ప్రధానికి పంపించారు. అనూహ్యంగా ఇది జరిగిన తర్వాతే పాకిస్తాన్ ప్రధాని పదవిని ఇమ్రాన్ పోగొట్టుకోవడం గమనార్హం.
ట్రంప్, ఇమ్రాన్ మాత్రమే కాదు.. మోడీతో చేతిలో చేయివేసిన బ్రిటన్ ప్రధాని పోస్ట్ కూడా ఊస్ట్ అయ్యింది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన బోరిస్ జాన్సన్ ప్రధాని మోడీతో రాసుకుపూసుకు తిరిగారు. ఇద్దరూ కలిసి కవల సోదరుల్లా మీడియా ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలా మోడీని కలిసి అలా బ్రిటన్ వెళ్లారో లేదో అక్కడ ఆయనపై అసమ్మతి చెలరేగి ఉన్న పదవి ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇక జపాన్ ప్రధాని షింజో అబేతోనూ మోడీకి మంచి స్నేహం ఉంది. మోడీ తరహాలో దుస్తులను అప్పట్లో షింజే అబోకే పంపారు. షింజే అబే కూడా అప్పట్లో మోడీ డ్రస్ ధరించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈయనను కాల్పుల్లో కొందరు దుండగులు కాల్చి చంపడం విషాదం నింపింది.
అయితే వీరి పదవులు పోవడానికి ప్రధాని మోడీ ఎంత మాత్రం కారణం కాదు. కానీ యథాలాపంగా మోడీని కలిసిన తర్వాతనే వారికి ఎఫెక్ట్ అయ్యింది. అప్పటివరకూ అప్రతిహతంగా సాగిన వారి జైత్రయాత్రకు మోడీ హస్తం భస్మాసుర హస్తమని ప్రత్యర్థులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడీ పోలికలు చెబుతూ మోడీ హ్యాండ్ పై సెటైర్లు పేలుస్తున్నారు. కానీ వారు చేసిన పరిపాలనననే వారికి చేటు తెచ్చిందని.. అంతే తప్ప మోడీ చేసిందేమీ లేదని కొందరు వాదిస్తున్నారు. పాక్ ప్రధాని పదవి పోవడానికి మాత్రం మోడీతో స్నేహమే కారణమని అక్కడి సైన్యాధ్యక్షుడు కూడా అనడం అప్పట్లో సంచలనమైంది. ఏది ఏమైతేనేమీ.. మోడీతో పోల్చి మరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచదేశాధినేతల బ్యాడ్ టైంకు మోడీ కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు.