Begin typing your search above and press return to search.
మోడి సర్కార్ కే ఊపిరందటం లేదా ?
By: Tupaki Desk | 9 May 2021 5:49 AM GMTఇన్ని సంవత్సరాలుగా రాజకీయ క్రీడకు మాత్రమే అలవాటుపడిన నరేంద్రమోడి ప్రభుత్వానికి మొదటిసారి కరోనా వైరస్ రూపంలో అసలైన ప్రత్యర్ధి ఎదుటిపడింది. దాంతో ప్రత్యర్ధి దాడిని తట్టుకోలేక మోడి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైపోతోంది. కరోనా వైరస్ అనే ప్రత్యర్ధిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గడచిన ఏడాదిగా మోడి సర్కార్ అచేతనమైపోయింది. తాజాగా మోడిపై డైరెక్టు ఎటాక్ చేస్తు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాసిన లేఖ దేశంలో ఇపుడు సంచలనంగా మారింది.
కరోనా సెకెండ్ వేవ్ ను ఎదుర్కునే విషయంలో వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు నెలల ముందే హెచ్చరికలు చేసినా కేంద్రం పట్టించుకోలేదంటు దుయ్యబట్టింది. మోడి నిర్లక్ష్యం, అలక్ష్యం వల్లే ఇపుడు యావత్ దేశం మూల్యం చెల్లించుకోవాల్సొస్తోందంటు దుమ్ము దులిపేసింది. కేంద్రం వైఫల్యంపై ఒకవైపు డాక్టర్లు, మరోవైపు శాస్త్రజ్ఞులు, ఇంకోవైపు మామూలు జనాలు, బాధితులు చేస్తున్న మాటల దాడులతో మోడికి ఊపిరాడటం లేదు.
గడచిన ఏడేళ్ళు బాధ్యత లేకుండా హ్యాపీగా నెట్టుకొచ్చేసిన మోడికి జనాగ్రహం అంటే ఏమిటో ఇపుడు బాగా అర్ధమవుతోంది. ఏ విషయంలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీసినా మోడి అసలు సమాధానమే చెప్పలేదు. ఎన్ని సమస్యలను ప్రస్తావించినా మోడి ఏరోజు లెక్కచేయలేదు. అదేమంటే అసలు పార్లమెంటుకే హాజరుకారు. రోజుల తరబడి పార్లమెంటుకు హాజరుకానీ ప్రధానమంత్రిగా నరేంద్రమోడి రికార్డులకెక్కారు.
మొదటిసారి ప్రతిపక్షాల స్ధానంలో కరోనా వైరస్ అసలైన ప్రతిపక్షంగా అవతరించింది. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. మోడి వైఫల్యాలపై అంతర్జాతీయస్ధాయి మీడియా దుమ్ము దులిపేసింది. వివిధ కారణాలతో జాతీయమీడియా కళ్ళు మూసుకున్నా సోషల్ మీడియా మాత్రం రెచ్చిపోతోంది. తాజాగా మోడితో సంబంధం లేకుండానే సుప్రింకోర్టు కరోనా వైరస్ కట్టడికి ఏకంగా జాతీయస్ధాయిలో ఓ కమిటిని నియమించిందంటేనే మోడి ఫెయిల్యూర్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.