Begin typing your search above and press return to search.

మోడిని బాగా రెచ్చ గొడుతోందే ?

By:  Tupaki Desk   |   29 Jun 2021 7:31 AM GMT
మోడిని బాగా రెచ్చ గొడుతోందే ?
X
చూస్తుంటే ప్రముఖ సామాజికమాద్యమం ట్విట్టర్ వ్యవహారంపై అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నూతన ఐటి చట్టం పరిదిలోకి ట్విట్టర్ కూడా రావాల్సిందేనని, భారతీయ చట్టాలకు లోబడే ట్విటర్ పనిచేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలను ట్విట్టర్ యాజమాన్యం ధిక్కరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై ఇటు కేంద్రానికి అటు ట్విట్టర్ కు మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే తాజాగా సామాజిక మాద్యమం చేసిన పని బరితెగింపుగానే ఉంది.

ట్విట్టర్ లో జమ్మూ-కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగాను, లడ్డాఖ్ డ్రాగన్ భూభాగంలోని ప్రాంతంగా చూపించింది. జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక దేశమా లేక భారత్ లో అంతర్భాగమా అని ట్విట్టర్ కు తెలీకుండా ఉంటుందని అనుకునేందుకు లేదు. అలాగే లడ్డాఖ్ భారత్ లో భూభాగమా లేకపోతే చైనా అంతర్భాగమో తెలీకుండా ఉందా ? అంటే కావాలనే ట్విట్టర్ యాజమాన్యం భారత్ ను రెచ్చగొడుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇదంతా సరిపోదన్నట్లుగా భారత్ లో ట్విట్టర్ గ్రీవెన్స్ అధికారిగా ఓ అమెరికన్ను నియమించింది. మొన్నటి గ్రీవెన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేశారు. ఆయన ప్లేసులో యాజమాన్యం మరో భారతీయుడిని నియమించాల్సిన ట్విట్టర్ కావాలనే అమెరికన్ను నియమించింది.

ట్విట్టర్ వైఖరి చూస్తుంటే నరేంద్రమోడినే రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తోంది. కావాలనే కేంద్రం నిబంధనలను థిక్కరించటం, నువ్వెంతంటే నువ్వెంత అనే స్ధాయికి ట్విట్టర్ చేరుకున్న విషయం అర్ధమైపోతోంది. మిగిలిన సామాజికమాధ్యమాలన్నీ కేంద్రం తాజాగా రూపొందించిన మార్గదర్శకాలను, నిబంధనలను ఆమోదించిన విషయం తెలిసిందే. ఒక్క ట్విట్టర్ మాత్రమే మొదటినుండి కేంద్రంతో ఘర్షణ వైఖరినే అనుసరిస్తోంది.

భారత దేశం మ్యాపులను తనిష్టం వచ్చినట్లు మార్చేయటమంటే భారత్ సార్వభౌమాధికారాన్ని చాలెంజ్ చేయటమే. కాబట్టి ట్విట్టర్ విషయంలో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేంత అనివార్యత వచ్చేసింది. మరి నరేంద్రమోడి ఏమి చేస్తారనే ఆసక్తి పెరిగిపోతోంది. చూద్దాం ఏం చేస్తారో.