Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో రాజకీయం సంక్షోభం తప్పదా?

By:  Tupaki Desk   |   11 Jun 2020 9:50 AM GMT
రాజస్థాన్ లో రాజకీయం సంక్షోభం తప్పదా?
X
దేశంలో కరోనా మహమ్మరి సైలంట్ గా తన పని తాను చేసుకొని పోతుంది.. తామేమన్న తక్కువ అన్నట్లు రాజకీయ నేతలు సైతం కరోనా టైంలోనూ సైలెంట్ వ్యూహాలను రచిస్తూ ముందుకెళుతున్నారు. నిత్యం కరోనా చావు వార్తలకు అలవాటైన ప్రజలకు రాజస్థాన్లో జరుగుతున్న రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్లో ప్రభుత్వం మార్పు తప్పదా? అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనెలలోనే రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో రాజస్థానాల్లో రాజకీయాలు రంజుగా మారాయి. క్షణక్షణానికి అక్కడ రాజకీయం మారుతోంది.

*కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం..
కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 19న 24 రాజ్యసభ్య స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వీటిలో రాజస్థాన్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్క రాజ్యసభ స్థానం గెలవాలంటే 51 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉంటుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 107మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో ఆరుగురు బీఎస్పీ, 12మంది స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు. ఇక బీజేపీకి 72మంది ఎమ్మెల్యే బలం ఉంది.

*కాంగ్రెస్, బీజేపీ బలాబలాలు..
కాంగ్రెస్, బీజేపీ బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ సీటు దక్కటం ఖాయం. అయితే బీజీపీ రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి దిగి రాజకీయాన్ని వేడెక్కించింది. ఇద్దరు అభ్యర్థులను గెలుచుకునేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ యత్నిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను, ప్రభుత్వానికి మద్దతునిస్తున్న స్వతంత్రులను బేరసారాలకు ప్రయత్నిస్తుందని ఆయన డీజీకి లేఖ రాశారు. బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

*ఎమ్మెల్యేలు రిసార్టుకు తరలించిన కాంగ్రెస్..
బీజేపీ తమ ఎమ్మెల్యే లాగేందుకు సిద్ధమవడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి మాట్లాడుతూ మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో ఏం జరిగిందో రాజస్తాన్లో అదే జరుగుతోందన్నారు. తమ ఎమ్మెల్యేలను,తమకు మద్దతుగా ఉన్న స్వతంత్రులను వారివైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నుంచి కాపాడుకునేందుకు ఇప్పటికే వారందరినీ కాంగ్రెస్ పార్టీ జైపూర్‌లోని ఓ లగ్జరీ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఇప్పటికే ఎమ్మెల్యేలతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాజస్తాన్‌లోనూ అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లితే రాజస్థాన్లో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.