Begin typing your search above and press return to search.
మోడీయే ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారా ?
By: Tupaki Desk | 3 Feb 2022 10:35 AM GMTదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరసన గళం విప్పుతున్నారు. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం 2022-23 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిజానికి బడ్జెట్ చాలా నిరాసక్తంగా ఉంది. తాజా బడ్జెట్ రైతులు, పేదలు, మధ్య తరగతి జనాలకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.
ఇలాంటి బడ్జెట్ పై ముందుగా కేసీయార్ విరుచుకుపడ్డారు. బడ్జెట్ తీరుతెన్నులపై ఆయన నరేంద్ర మోడీ, కేంద్రమంత్రిని కలిపి వాయించేశారు. బడ్జెట్ ముసుగులో మోడీ పై తనకున్న కసినంతా కేసీయార్ తీర్చేసుకున్నారు. ఒకరోజు గడిచే టప్పటికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా నిరసన గళం వినిపించారు. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలంతా ఏకమవ్వాలంటు మమత పిలుపిచ్చారు.
అలాగే తాజా బడ్జెట్ ను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందంటు స్టాలిన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు 36 మంది కీలకమైన నేతలకు లేఖలు రాశారు. ఇప్పటికే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తన నిరసనను తెలిపారు. మహరాష్ట్రలో శివశేన+కాంగ్రెస్+ఎన్సీపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ ను వ్యతిరేకించింది. ఎలాగూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తారనటంలో సందేహంలేదు. తొందరలోనే ఇదే విషయమై యూపీఏ పక్షాలు+నాన్ యూపీఏ పార్టీల అధినేతలు సమావేశమయ్యే సూచనలు కనబడుతున్నాయి.
అందరూ ఐకమత్యంతో ఉంటే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని మమత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే యూపీఏతో పాటు ఇతర ప్రతిపక్షాలను కలపటానికి బహుశా మమత చొరవ తీసుకుంటున్నట్లే ఉంది. వీళ్ళ భేటీలు, ఐక్యతారాగం తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆధార పడుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి దేశంలోని రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే ప్రతిపక్షాలన్నింటినీ నరేంద్రమోడీయే కలిపేట్లున్నారు.