Begin typing your search above and press return to search.
మోహన్ బాబు కుటుంబం వైఎస్సార్సీపీకి దూరమైనట్టేనా?
By: Tupaki Desk | 5 Sep 2022 11:30 PM GMTగత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలోని తన ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజురీయింబర్స్‌మెంటు నిధులు ఇవ్వడం లేదంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు రోడ్డెక్కి గోలగోల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మోహన్‌బాబుది చిత్తూరు జిల్లా కావడం, శ్రీకాళహస్తి పరిధిలో ఆయన స్వగ్రామం ఉండటంతో శ్రీకాళహస్తి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అది నిజం కాలేదు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మోహన్ బాబు ప్రచారం చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మోహన్ బాబుకి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారని వార్తలు హల్చల్ చేశాయి. మోహన్ బాబు కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశించినట్టు అంటారు. అయితే ఏ పదవీ ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తి చెంది సైలెంట్ అయిపోయారని వార్తలు వచ్చాయి.
ఇక ఆ తర్వాత ఆన్‌లైన్ సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వం తనను తెలుగు సినిమా పెద్దగా గుర్తించకుండా చిరంజీవిని ఆహ్వానించడంతో మోహన్ బాబు హర్టయ్యారని చెప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి టీడీపీ దగ్గరవుతూ వచ్చారని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడిని కలసి సుదీర్ఘంగా చర్చలు జరపడం, అంతకుముందు తన కుమారుడిని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో గెలిపించాలని బాలకృష్ణ దగ్గరకు వెళ్లడం వంటివాటితో మోహన్ బాబు టీడీపీకి దగ్గరయినట్టేనని చెప్పుకున్నారు.
ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికా రెడ్డితో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం దాదాపు ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహం ఆడటం నిజమే అయితే వీరంతా తెలుగుదేశానికి దగ్గరయినట్టేనని అంటున్నారు.
తాజాగా మంచు మనోజ్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు త్వరలోనే రాజకీయ అరంగేట్రం, వివాహం ఇలా అన్ని విషయాలు గురించి వివరిస్తానని.. ప్రస్తుతం తాను వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చానని హైదరాబాద్‌లోని సీతాఫల్ మండిలో మీడియాకు వివరించాడు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం వైఎస్సార్సీపీని విడిచిపెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమేనని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.