Begin typing your search above and press return to search.
మొత్తానికి కేసీఆర్ కు ఎంపీ అరవింద్ భయపడ్డాడా? పెట్టాడా?
By: Tupaki Desk | 19 July 2022 11:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ అదే తెలంగాణ యాసలో తిట్టడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ది అందెవేసిన చేయి. ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. కేసీఆర్ కుమార్తెను ఓడించిన అరవింద్ ను గులాబీ శ్రేణులు సైతం కాస్త గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలో పర్యటనకు వెళితే ఆయన ముచ్చటపడి కొనుక్కున్న రెండున్నర కోట్ల విలువైన కారు అద్దాలు నాశనం చేసేశారు. ఇక బయటకు వస్తే చాలు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటూ హల్ చల్ చేస్తున్నాయి.
టీఆర్ఎస్ తో వేగలేక ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ వెనక్కి తగ్గాడు. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న ఎంపీ అరవింద్ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టం చేశారు. రాజకీయంగా , సాంకేతికపరంగానే కేసీఆర్ ను విమర్శిస్తానని.. ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు. అరవింద్ అంత ఆవేదనతో చెబుతున్నాడంటే ఆయనకు గులాబీ సెగ ఎంతగా తగిలిందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో తాజా పరిణామాలతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫైట్ మారింది.దీంతో బీజేపీని, ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్ నేతలు వదలడం లేదు. టీఆర్ఎస్ గ్రాఫ్ కారణంగానో లేక కుటుంబ వారసత్వ రాజకీయాల ఒత్తిడి కారణంగానో కేసీఆర్ మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అర్వింద్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.
కేసీఆర్ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని.. శనివారం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్ బరెస్ట్ చేయడంతోనే వరదలు సంభవించాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అరవింద్ అన్నారు.
ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్థులు షాక్ ఇచ్చారు. అరవింద్ కు ఎదురు తిరిగిన పరిస్థితి నెలకొంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూవివాదం పరిష్కరిస్తానని మాట ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నారు.
గ్రామానికి సంబంధించిన భూవివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి అతి కష్టం మీద గ్రామస్థులను పక్కకు తప్పించారు. కానీ బీజేపీ కార్యకర్తలు కొందరు గ్రామస్థులపై దాడి చేశారు. అనంతరం ముంపు గ్రామాలను పరిశీలించి తిరిగి వచ్చిన అర్వింద్ ను మళ్లీ కోపంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. తమపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఏకంగా ఎంపీ అరవింద్ ముచ్చటపడి కోట్లు పోసి కొనుక్కున్న కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు.
ఆ కారు విలువ అక్షరాల రూ.2.85 కోట్ల రూపాయలు. అంతటి ఖరీదైన 'లెక్సాస్ ఎస్.యూవీ' లగ్జరీ కారును ఎంపీ అరవింద్ ముచ్చటపడి కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు గ్రామస్థుల ఆగ్రహానికి ఆ కారు అద్దాలు, కారు కూడా ధ్వంసమైంది. ఈ దాడి తర్వాత అరవింద్ వాయిస్ ఛేంజ్ అయిపోయింది. టీఆర్ఎస్ మీద.. కేసీఆర్ మీద ఆయన మాటల దాడి డోస్ ను తగ్గించారు.