Begin typing your search above and press return to search.
టీడీపీలో సీటు ఖరారు.. వైసీపీ ఎమ్మెల్యే మారిపోయింది అందుకేనా?
By: Tupaki Desk | 14 Jan 2023 2:30 AM GMTవైసీపీ కీలక నాయకుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జంప్ చేయనున్నారా? ఆయనకు టీడీపీలోసీటు కూడా ఖరారైందా? అంటే.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. బాలయ్య సినిమా వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పోస్టర్లు వెలవడం.. దీనిపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తడం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.
అయినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం దీనిపై రియాక్ట్ కాకపోగా.. కుటుంబంతో సహా .. హైదరాబాద్‌కు వెళ్లిపోయా రని తెలుస్తోంది. మరోవైపు.. ఎంపీ కేశినేని నాని మరిన్ని సంచలన కామెంట్లు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చాలా మంచి నాయకుడు అని..ఆయన తన నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడుతు న్నాడని.. సీఎం జగన్ పట్టించుకోకపోయినా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
అంతటితో కూడా ఆగకుండా..తానే తన ఎంపీ నిధుల నుంచి మైలవరం నియోజకవర్గానికి కోట్ల రూపాయలు కేటాయించానని, ఆ నిధులతోఎమ్మెల్యే చక్కగా అభివృద్ధి పనులు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలకు తోడు.. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు చారిటబుల్‌ట్రస్ట్ అధినేత ఉయ్యూరు శ్రీనివాసరావు నను అరెస్టు చేయడాన్ని వసంత గతంలో నే తప్పుబట్టారు.
దీంతో ఇక, ఆయన వైసీపీ నుంచి బయటకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.దీనికి దన్నుగా మరో కామెంట్ కూడా వినిపిస్తోంది. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని.. ఆయనను నూజివీడు పంపిస్తున్నారని.. ఇక్కడ వేరే వారికి టికెట్ ఇస్తున్నారని .. టీడీపీలో చర్చ సాగుతోంది. ఆ వేరేవారు ఎవరు అనేది ఇప్పటికి తెలియకపోయినా..ఆయన వసంతేనని అంతర్గత చర్చల్లో బయటపడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.