Begin typing your search above and press return to search.
మందలగిరిలో లోకేశ్ పని అయిపోయినట్లేనా?
By: Tupaki Desk | 10 April 2019 4:14 AM GMTఏమాటకామాట చెప్పుకోవాలి ఈసారి ఏపీ ఎన్నికలు రాజకీయ ఆసక్తి ఉన్నవారికి మంచి కిక్ ఇస్తున్నాయి. పార్టీల మధ్య పోటీతో పాటు సంచలన విజయాలు, అనూహ్య అపజయాలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైసీపీ అధినేత జగన్ తన పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. అదే సమయంలో సీఎం చంద్రబాబు తనయుడు, మందలగిరి(మంగళగిరి)లో పోటీ చేస్తున్న నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి కోసం పార్టీ నేతలు చాలామంది ప్రచారం చేశారు. అంతేకాదు.. జగన్ కూడా తన చివరి రోజు ప్రచారాన్ని మంగళగిరిలోనే ప్లాన్ చేశారు. అక్కడ ఆయన ప్రచారం సూపర్ సక్సెస్ అయింది కూడా.
మంగళవారం ప్రచారం చివరి రోజున మంగళగిరిలో జగన్ ప్రచారం చూసినవారు అక్కడ లోకేశ్ ఓటమి ఖాయమంటున్నారు. రాజాధానిలో భూసమీకరణ విషయంలో జరిగిన అన్యాయాలు, అవకతవకలపై అక్కడి వైసీపీ ఎమ్మెల్యే రాజీలేని పోరాటాలు చేశారు. అమరావతిలో లొసుగులపై ఎన్నో కేసులు వేశారు. ఇప్పుడు అక్కడికి లోకేశ్ వచ్చి ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంతప్రచారం చేసినా వైసీపీదే విజయమని జగన్ నమ్ముతున్నారట.
మరోవైపు రాజధానికి భూములిచ్చిన రైతులు నష్టపోకుండా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు లోకేశ్ ను అడ్డుకునే ప్రయత్నాలూ అన్నీకలిసొచ్చి అక్కడ వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నారు. దీంతో తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే నారా లోకేశ్ బాబు బొక్క బోర్లా పడడం తథ్యమంటున్నారు.