Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఆత్మగౌరవమే చచ్చిపోతోందా.. నందమూరి ఫ్యామిలీ తీరుపై విస్మయం!
By: Tupaki Desk | 23 Sep 2022 6:10 AM GMT"ఇది ఒక అత్యంత కీలకమైన సందర్భం! అంతకుమించి.. దివంగత అన్నగారు ప్రవచించిన.. ఆత్మగౌరవ నినాదానికి గొడ్డలి పెట్టు!"- ఎన్నారైల నుంచి.. స్థానికుల వరకు కూడా వెల్లువెత్తుతున్న కామెంట్లు ఇవి. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. రోడ్డెక్కి.. గర్జించిన.. సింహం.. జూలు కత్తిరిస్తున్నా.. మారు మాటాడక పోవడం..'రెండు ట్వీట్లు.. ఒక కామెంట్'తో సరిపెట్టుకోవడం.. వంటివి నందమూరి కుటుంబానికి.. చెల్లునా? అనేది మేధావుల మాట. ఇంతగా భోగిమంటలు రాజుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా.. అన్నగారి అభిమానులు.. రోడ్డెక్కితే.. ఆయన కుటుంబం.. మాత్రం హైదరాబాద్ పరిధిలో గిరి గీసుకుని.. ట్వీట్ల యుద్ధంతో కాలక్షేపం చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికి.. రెండు కీలక విషయాల్లో.. అన్నగారి ప్రభావాన్నితగ్గించే చర్యలు చేపట్టింది. ఒకటి.. అన్న ఎన్టీఆర్ పేరుతో.. ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను తీసేయడం. పెడుతున్నా.. అడ్డుకోవడం. ఈ విషయంలో నందమూరి కుటుంబం జోక్యం చేసుకోలేదు.
చేసుకోమని కూడా ఎవరూ కోరడం లేదు. ఎందుకంటే.. ఇది రాజకీయంగా.. జరుగుతున్న ప్రక్రియ. ప్రభుత్వం పరంగా దీనిలో ఎలాంటి జోక్యం(పైకి) లేదు. సో.. ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ జోక్యం చేసుకోకపోయినా.. ఎవరూ పెద్దగా స్పందించలేదు. పట్టించుకోవాలనే డిమాండ్లు కూడా పైకి రాలేదు.
కానీ, ఇప్పుడు అన్నగారు ఎంతో శ్రమించి.. ఢిల్లీ పెద్దలను ఒప్పించి.. విజయవాడలో స్థలాన్ని ఇచ్చి.. జాతీయ రహదారి(విజయవాడ-రాజమండ్రి)పై ఏర్పాటు చేసిన.. హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం.. మాత్రం ప్రభుత్వ జోక్యం ఉంది. ప్రభుత్వమే బిల్లు పెట్టింది. రాత్రికిరాత్రి ప్రకటన ఇచ్చి.. 24 గంటలు గడిచేలోగా.. నిర్ణయాన్ని సైతం అమలు చేసి.. ఎన్టీఆర్ పేరును చరిత్ర నుంచి తీసేసే.. దుస్సాహసం చేసింది. మరి ఇంత జరిగిన తర్వాత.. కూడా నందమూరి కుటుంబం రెండు ట్వీట్లతో సరిపుచ్చడం.. ఏంటి? దీనిని ఏమంటారు?. ఇది తెలుగు జాతి కంటే.. అన్నగారి ఆత్మగౌరవానికే గొడ్డలి పెట్టు.. అని భావించలేకపోవడం నందమూరి కుటుంబం చేస్తున్న ప్రధాన తప్పుకాదా! అనేది నెటిజన్ల ప్రశ్న.
ఇప్పుడు చేయాల్సింది ఏంటి? తమకు సమాజంలో గుర్తింపు ఇచ్చిన.. తమ జీవితాల్లో ఒక కేరాఫ్ నింపిన అన్నగారు ఎన్టీఆర్ కోసం.. నందమూరి కుటుంబం.. కట్టకట్టుకుని.. విజయవాడ రావడం. ప్రభుత్వ దుర్నీతిని.. ఎండగట్టడం.. అదే హెల్త్ యూనివర్సిటీ ముందు.. రాజకీయాలకు అతీతంగా నిరసన వ్యక్తం చేయడం.. ముఖ్యమంత్రిని కలవడం.. వంటివి ఎందుకు చేయలేక పోతోంది? అన్నగారి అభిమానులే.. ముందుకు వస్తుంటే.. ఆయన కుటుంబం తెరచాటున ఉండిపోవడం కన్నా.. అన్నగారి ఆత్మగౌరవానికి వచ్చినష్టం పెద్దది కాదేమో! అంటున్నారు పరిశీలకులు.
మరి ఇప్పటికైనా.. వ్యాపారాలు.. షూటింగులను పక్కన పెడతారా.. కేవలం 24 గంటలు.. తమకు జీవితాలను ప్రసాదించిన అన్నగారి కోసం.. 'కాల్ షీట్' ఇస్తారా? ఇదీ.. అన్నగారి అభిమానులు సూటిగా అడుగుతున్న ప్రశ్న. లేకపోతే..ఇదే చేయకపోతే.. అన్నగారు జనం గుండెల్లో మిగిలిపోతారు.. కానీ, నందమూరి కుటుంబమే.. తలదించుకుని.. జీవించాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చరిత్ర ఎన్నటికీ వారిని క్షమించదని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.