Begin typing your search above and press return to search.

అణుదాడి తప్పదా ?

By:  Tupaki Desk   |   11 Oct 2022 9:30 AM GMT
అణుదాడి తప్పదా ?
X
దక్షిణకొరియాపై అణుదాడి చేయటానికి ఉత్తరకొరియా రంగం సిద్దం చేసుకుంటున్నదా ? దాయాదిదేశంపైన అణుదాడి చేయటం కోసం అవసరమైన ప్రాక్టీసు చేస్తున్నట్లు ఉత్తరకొరియా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా అణ్వాయుధాలను ఎక్కడ ప్రయోగిస్తుందో అనే టెన్షన్ ప్రపచందేశాలను పట్టిపీడిస్తోంది. ఏడుమాసాలు దాటినా చిట్టెలుక అనుకున్న ఉక్రెయిన్ పై రష్యా ఇంకా సంపూర్ణ ఆధిక్యత సాధించలేదు.

యుద్ధం ఇంతకాలం సాగిన కారణంగా రష్యాకు ఇప్పటికే అనేకరకాలుగా నష్టాలు జరిగాయి. ఉక్రెయిన్నే జయించలేకపోయిందని ప్రపంచదేశాలు రష్యాను ఎగతాళిగా మాట్లాడుతున్నాయి. దాంతో తానేంటో నిరూపించుకునేందుకు ఉక్రెయిన్ నెత్తిన ఒక అణుబాంబు పడేస్తే సరిపోతుందని రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ భావిస్తున్నారు. పుతిన్ సరిగ్గా ఇలాంటి హెచ్చరికలనే పరోక్షంగా పంపించటంతో ప్రపంచదేశాలు ఆందోళనతో ఉన్నాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే దక్షిణికొరియాపై ఏ నిముషంలో అయినా అణుబాంబులు ప్రయోగించేందుకు ఉత్తరకొరియా రిహార్సల్స్ చేస్తోందనే ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఈమధ్యనే జపాన్ మీదుగా ఉత్తరకొరియా అణుబాంబులను ప్రయోగించింది.

దాంతోనే జపాన్ మద్దతుగా నిలిచే దేశాలు ఉత్తరకొరియా చర్యలపై మండిపోయాయి. మిస్సైల్స్ లో టాక్టికల్ అణ్వాయుధాలను ప్రయోగించటాన్ని లోడ్ చేయటాన్ని ప్రాక్టీసు చేసిందట. దక్షిణకొరియాలోని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, సైనిక స్ధావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీలుగా ఉత్తరకొరియా ప్రాక్టీసు చేస్తోందని సమాచారం. ఈ పరీక్షలను స్వయంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షిస్తున్న ఫొటోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈమధ్యనే ఉత్తరకొరియా చేసిన స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగం విజయవంతమైందని ఉత్తరకొరియా ప్రకటనతో అన్నీ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరకొరియా అధినేత కిమ్ వైఖరి ఏరోజు ఎలాగుంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

ఎవరి మీద కోపాన్ని ఇంకెవరి మీదో లేకపోతే దక్షిణకొరియా మీద చూపించినా చూపిస్తారు. నిద్రలో కూడా కిమ్ కు అమెరికా అంటే నిలువెత్తు ధ్వేషమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే దక్షిణకొరియా ప్రతిరోజు వణికి చచ్చిపోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.