Begin typing your search above and press return to search.

'పద్మ' అవార్డుల్లోనూ రాజకీయమా?

By:  Tupaki Desk   |   28 Jan 2021 8:00 AM IST
పద్మ అవార్డుల్లోనూ రాజకీయమా?
X
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ సాంతం వాడుకుంటోందన్న విమర్శ ఉంది. ప్రతీదాంట్లోనూ బీజేపీ పెద్దలు రాజకీయంగా మేలు జరిగితే ఏదైనా చేస్తారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే 'పద్మ' అవార్డులను కూడా కలుషితం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యంత పారదర్శకంగా ఇచ్చామని కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులపైనా తాజాగా విమర్శలు వస్తున్నాయి. వీటిని రాజకీయ అవసరాల కోసం పంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలకు ఏకంగా కేంద్రం 32 పద్మ అవార్డులను ప్రకటించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకు ఈ రాష్ట్రాలకు ఇన్ని అవార్డులు ఇచ్చారని చూస్తే త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని తేలింది.

మరో 4 నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కావడంతోనే అక్కడి వారిని ఆకట్టుకునేలా ఈ అవార్డులు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడుకు అత్యధికంగా 11, అసోంకు 9, బెంగాల్ కు 7, కేరళకు 6, పుదుచ్చేరికి ఓ అవార్డు వచ్చింది.. దీన్ని బట్టి ఎన్నికల కోణంలోనే బీజేపీ అధిష్టానం ఈ పద్మ అవార్డులను పంచిదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.