Begin typing your search above and press return to search.
పవన్ అల్ప సంతోషా?
By: Tupaki Desk | 12 Nov 2022 11:30 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే, ఇదే మహద్భా గ్యం అన్నట్టుగా జనసేన నాయకులు ప్రచారం చేసుకున్నారు. అదేసమయంలో టీడీపీని తిట్టిపోసే కార్య క్రమం చేపట్టారు. నిజానికి 2014లో పవన్-నరేంద్ర మోడీలు(అప్పటికి ప్రధాని కాలేదు) ఒకే వేదిక పంచుకుని.. తిరుపతిలో ప్రచారం చేశారు. తర్వాత మోడీ ప్రధాని అయ్యారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ పవన్‌కు ఆహ్వానం అందింది. అయినాఆయన దూరంగానే ఉండిపోయారు.
ఇక, 2019లో వేర్వేరుగా పోటీ చేశారు. పవన్ ఓడిపోయారు. అనూహ్యంగా 2020లో బీజేపీతో చేతులు కలిపి నా పవన్‌కు మోడీ దర్శనం లభించలేదు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనే ఆయన మాట్లాడి వచ్చేవారు. లేకపోతే అడపా దడపా అమిత్‌షాతో రెండు సార్లు కలుసుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రధానితో 2014 ఎన్నికల తర్వాత పవన్ భేటీ కావడం చర్చించడం అనేది ఆసక్తిగా మారిన విషయం వాస్తవమే.
అయితే, దీనిని జనసేన కార్యకర్తలు చిలవలు పలవలు గా ప్రచారం చేయడం.. ఏపీలో ఏదో జరిగిపోతోంద ని భావించడం ఒకింత అతి అనిపించకపోదు. ప్రధానితో పవన్‌కు అప్పాయింట్‌మెంట్ ఖరారు కాగానే కేడర్ మొత్తం పండగ చేసుకున్నారు. అంతేకాదు.. టీడీపీపై విమర్శలు చేస్తూ.. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది చూస్తే.. బీజేపీ-జనసేన ఒకే తల్లికి పుట్టిన పార్టీలు అనిపించే స్థాయిలో నాయకులు రెచ్చిపోయారు.
ఇదంతా ఎవరు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుల, సినిమా పోటీల ప్రాతిపదికన టీడీపీ, జనసేన పొత్తుపై విముఖత చూపుతున్న బ్యాచ్ ఇదంతా చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికి మూడేళ్లుగా పవన్‌కు మోడీ అసలు అప్పాయింట్‌మెంటే ఇవ్వలేదు. ఈ విషయాన్ని వారు మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ భేటీ తర్వాత పవన్ అసలు మీడియా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు.
కనీసం పొత్తులపైకానీ, రోడ్ మ్యాప్‌పై కానీ ఆయన ఎక్కడా పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. అయితే, ప్రధాని మోడీకి మాత్రం అపరమితమైన గౌరవం, మర్యాద ఇవ్వడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వైసీపీ పాలనలోని లోపాలు.. ప్రజాస్వామ్య విధ్వంసం అంటూ ఏవో కొన్ని విషయాలు పవన్ .. మోడీకి చెప్పినట్టు సమాచారం. అందుకే ఆయన తన పార్టీ నేతల మాదిరిగా కాకుండా.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.