Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కూడా అవ‌కాశ వాద రాజకీయం చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:30 PM GMT
ప‌వ‌న్ కూడా అవ‌కాశ వాద రాజకీయం చేస్తున్నారా?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా తిరుప‌తి జిల్లాలో నిర్వ‌హించిన జ‌న‌వాణి కార్య‌క్ర‌మం అనంత రం మీడియాతో్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌నిలో పనిగా..అనేక విష‌యాలు మాట్లాడారు. ఈ మాట‌ల్లో.. త‌న సోద‌రుడు, మెగా స్టార్ చిరంజీవి గురించి కూడా ప్ర‌స్తావ‌న తెచ్చారు. ప్ర‌జారాజ్యం పార్టీ ఇప్పుడు క‌నుక ఉండి ఉంటే.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఉండేద‌ని చెప్పారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు.

ప్ర‌జారాజ్యం ఉండి ఉంటే.. దాదాపు 2014 లేదా, 19 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి ఉండేద‌నే విశ్లేష‌ణ‌లు .. ఉదంతాలు.. ఉదాహ‌ర‌ణ‌కు కూడా అనేకం వ‌చ్చాయి. దీనిని ప‌వ‌న్ చెప్పినా..చెప్ప‌క పోయినా.. అంద‌రి కీ తెలిసిన నిజ‌మే. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ప్ర‌శ్న‌ల‌కు దారితీస్తున్నా యి. అదేంటంటే.. నాటి ప్ర‌జారాజ్యం పార్టీని.. కొంద‌రు.. ద‌గ్గ‌రుండి మ‌రీ.. కాంగ్రెస్‌లో విలీనం చేయించా ర‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వీరంతా ఇప్పుడు వైసీపీలో ఉన్నార‌ని చెప్పారు.

అయితే.. ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడే ఎందుకు ప‌వ‌న్ వ్యాఖ్యానిస్తున్నారు?  గ‌తంలో ఆయ‌న యువ రాజ్యం అనేయూత్ వింగ్‌ను న‌డిపించారు క‌దా.. అప్పుడు.. ఎందుకు వీరిని అడ్డుకోలేక పోయారు. లేదు.. 2014లో ఎందుకు ప్ర‌స్తావించ‌లేదు. పోనీ.. ద‌గ్గ‌రుండి ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయించి న వారిలో ఎవ‌రు ఉన్నారు?  కాపు నాయ‌కులే క‌దా. వారిలో ఒక‌రిద్ద‌రు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌దవు లు కూడా అనుభ‌వించారు క‌దా! ఈ ప‌ద‌వులు ఇవ్వాల‌ని.. ప‌వ‌నే క‌దా సిఫార‌సు చేసింది.

ఎన్ని అవినీతి మ‌ర‌క‌లు అంటినా.. ఓ మంత్రిని అయిష్టంగానే చంద్ర‌బాబు కొన‌సాగించ‌డం వెనుక‌.. ప‌వ‌న్ ఉన్నారు క‌దా! ఆయ‌న‌కూడా ప్ర‌జారాజ్యం విలీన పాపంలో ఒక పిడికెడు రాజ‌కీయం చేశారు క‌దా! ఇక‌, ఇదే విష‌యాన్ని చ‌ర్చించుకోవాల్సి వ‌స్తే.. మెగా కుటుంబంలోని బ‌డా నిర్మాత వైపే అంద‌రి వేళ్లూ చూపి స్తారు. ఆయ‌నే పార్టీని నాశనం చేశార‌ని.. అనేక మంది మీడియామీటింగులు పెట్టి మ‌రీ..వ్యాఖ్యానించారు. అప్ప‌టి ప్ర‌జారాజ్యం నేత‌లు.. మిత్రా, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌లు.

అంతేకాదు.. సాక్షాత్తూ.. వారు ప్ర‌జారాజ్యంఆఫీసులో మీటింగు పెట్టి.. తాము పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామ‌ని చెబుతూ.. ఎవ‌రి వ‌ల్ల పార్టీ నాశ‌నం అయిందో విప్పి మ‌రీ చెప్పిన సంగ‌తులు ప‌వ‌న్ మ‌రిచిపోయినా.. ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు.

ఇప్పుడు ఇవ‌న్నీ మ‌రిచిపోయి.. కొంద‌రిని.. టార్గెట్‌చేయ‌డం వ‌ల్ల‌.. పోయిన పార్టీ రాదు.. అయితే..దీని నుంచి సింప‌తీని కోరుకుంటే.. మాత్రం ప‌వ‌న్‌కు చెప్పేది ఏమీలేదు. కానీ, ఒక్క‌టి మాత్రం నిజం.. ప్ర‌జారాజ్యం గురించిన ప్ర‌స్తావ‌న తేవ‌డం క‌న్నా.. భ‌విష్య‌త్తుపై దృష్టిపెడితే..ప‌ది ఓట్లు రాల‌తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.