Begin typing your search above and press return to search.

బీజేపీతో జట్టుకట్టాక పవన్ పరవశమే?

By:  Tupaki Desk   |   27 Jan 2021 10:07 AM GMT
బీజేపీతో జట్టుకట్టాక పవన్ పరవశమే?
X
2019 ఎన్నికల వేళ ఏపీకి పాచిపోయిన 'లడ్డూ' ఇస్తారా? అని ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీని నిలదీస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కడిగేశారు. ఆ ఎన్నికల్లో మ్యూనిస్టులతో వెళ్లిన పవన్ ఘోరంగా ఓడిపోయి తత్త్వం బోధపడి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని సాగుతున్నారు.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పద్మ అవార్డుల్లో రాజకీయం కోణం ఉందని.. ఏ సేవ చేయలేని.. బీజేపీ అనుకూల రాజకీయ నాయకులకు 'పద్మ' పురస్కారాలు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ మాత్రం మరోసారి బీజేపీని వెనకేసుకొస్తూ 'పద్మ' అవార్డులపై పరవశించిపోయారు. హాట్ కామెంట్స్ చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రకటించిన 'పద్మ' పురస్కారాల ఎంపిక ప్రతిభకు పట్టంకట్టేలా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను 'పద్వ విభూషణ్' పురస్కారానికి ఎంపి చేయడం సంతోషం కలిగించిందని అన్నారు. ఇక అన్నవరపు రామస్వామి, సుమతిలకు పద్మశ్రీ దక్కడం తెలుగువారికి దక్కిన గౌరవం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కనకరాజును పద్మశ్రీ ఎంపిక చేయడం కళలకు మరింత జీవం పోసిందన్నారు. ప్రతిభావంతులకు పట్టంగట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగిందని పవన్ కొనియాడారు.

అయితే రాజకీయ నాయకులు.. బీజేపీ మాజీ నేతలకు పద్మ పురస్కారాలపై మాత్రం పవన్ నోరుమెదపలేదు. దేశవ్యాప్తంగా ఈసారి పద్మ పురస్కారాలపై వచ్చిన విమర్శలపై కూడా పవన్ స్పందించాలని.. బీజేపీ పక్షపాతాన్ని గుర్తించాలని పలువురు హితవు పలుకుతున్నారు.