Begin typing your search above and press return to search.
వైసీపీ ఓటు బ్యాంక్‌పై పవన్ దృష్టి సారించారా?
By: Tupaki Desk | 27 Oct 2022 5:14 AM GMTవచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. గతంతో పోలిస్తే జనసేన పార్టీ బలపడిందనే విషయాన్ని కూడా అందరూ అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కడప తదితర జిల్లాల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉంటుందని చెబుతున్నారు.
ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గం కాపులు పవన్ వెంటే నడుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు తోడుగా మరికొన్ని సామాజికవర్గాలను తనవైపుకు ఆకర్షించాలనే వ్యూహంలో పవన్ ఉన్నారని అంటున్నారు.
పవన్ కల్యాణ్‌ను సినిమాలపరంగా కులాలు, మతాలకతీతంగా లక్షలాది మంది అభిమానులు ఆరాధిస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది ఎన్నికలకు వచ్చేటప్పటికీ వేరే పార్టీకి ఓటేస్తున్నారని తేలింది. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనమంటున్నారు. ఈసారి అలా జరగకుండా జనసేన శ్రేణులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు.
బీసీల్లో మత్స్యకారులు, ఎస్సీల్లో రెల్లి కులస్తులపై పవన్ పెద్ద ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఈ వర్గాలకు గత ఎన్నికల్లోనే పవన్ పలు హామీలిచ్చారు. అంతేకాకుండా తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. ఈ వర్గం ప్రధానంగా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈసారి వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే దృష్టిపెట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు దాదాపు 7 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం టీడీపీకి పడాల్సిన ఓట్లేనని.. ఈ ఓట్లన్నీ పవన్‌కు పడటంతో టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో నష్టం జరిగిందని వెల్లడైంది.
ఈసారి జనసేన–టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తనకు అండగా ఉన్న సామాజికవర్గాలతోపాటు వైసీపీకి కొమ్ముకాస్తున్న సామాజికవర్గాలపైన పవన్ కల్యాణ్ దృష్టి సారించారని పేర్కొంటున్నారు.
వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్నారు. ఈ కులాల్లో పవన్ కల్యాణ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. వాస్తవానికి ముస్లింలకు గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇచ్చింది జనసేన పార్టీయే కావడం గమనార్హం. పార్లమెంటు సీట్లలోనూ ముస్లింలను జనసేన పార్టీ బరిలోకి దింపింది.
ఈ నేపథ్యంలో వైసీపీకి ప్రధాన అండగా నిలుస్తున్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారని సమాచారం. కొంతవరకు ఈ వర్గాల్లో ఓట్లను తనవైపునకు తిప్పుకోగలిగితే ఒంటరిగా పోటీ చేసిన మంచి సీట్లను సాధించవచ్చని ఆయన లెక్కలేసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.