Begin typing your search above and press return to search.
పవన్ పోటీ ఇక్కడి నుంచేనా?
By: Tupaki Desk | 14 Jan 2023 9:30 AM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటివారు సైతం చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో జనసేన టికెట్లకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు.
మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ పోటీపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇంకోవైపు పవన్.. కాకినాడ రూరల్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ రూరల్ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లోనూ ఆయనే పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
కాకినాడ రూరల్.. కాపుల ఇలాకా. 2009లో ఇక్కడ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరపున కురసాల కన్నబాబు గెలుపొందారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలోకి వచ్చి విజయం సాధించారు. వైఎస్ జగన్ మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా కన్నబాబు బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కన్నబాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కన్నబాబు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మొత్తం కాకినాడ రూరల్ లో ఓటర్లు 1.40 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది కాపు ఓటర్లే. ఈ ప్రభావం 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయానికి దోహదపడింది. అలాగే 2019లో జనసేన పార్టీకి సైతం దాదాపు 40 వేల ఓట్లు కాకినాడ రూరల్ లో వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన తరఫున పంతం నానాజీ పోటీ చేశారు.
ఇక టీడీపీ తరఫున బీసీ సామాజికవర్గానికి చెందిన పిల్లి అనంత లక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో మాత్రం ఈమె గెలుపొందారు. ఈసారి జనసేన–టీడీపీ పొత్తు కుదిరితే కాకినాడ రూరల్ జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయం.
ఇప్పటికే జనసేనాని పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుపతి, పిఠాపురం (కాకినాడ జిల్లా), అవనిగడ్డ (కృష్ణా జిల్లా) వీటిలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నుంచే పోటీ చేయొచ్చనే టాక్ కూడా నడుస్తోంది.
టీడీపీతో పొత్తు కుదిరినా, కుదరకపోయినా కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తే గెలుపొందడం ఖాయమనే చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీ ట్రాక్ రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక టీడీపీతో పొత్తు కుదిరితే పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీ సాధించడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.