Begin typing your search above and press return to search.

పవన్ టచ్ లోకి పవర్ ఫుల్ పొలిటీషియన్ ...?

By:  Tupaki Desk   |   17 Oct 2022 10:35 AM GMT
పవన్ టచ్ లోకి పవర్ ఫుల్  పొలిటీషియన్ ...?
X
జనసేన వచ్చే ఎన్నికల్లో బిగ్ ఫోర్స్ అవుతుంది అని అంతా అంచనా కడుతున్నారు. ఏపీలో కొత్త రాజకీయానికి జనాలు ఓటేయాలనుకున్నపుడు కళ్ళ ముందు కనిపించే ఏకైక ఆప్షన్ జనసేన. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని పరుగులు తీయించాలని చూస్తున్నారు. ఆ పార్టీ గ్రాఫ్ కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగింది అని సర్వే నివేదికలు చెబుతున్నాయి.

మరో వైపు చూస్తే గతంలోలా కాకుండా పార్టీ విస్తరణకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన నేతలను సీనియర్లను తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన వైపు సీరియస్ గానే చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలలో కీలకమైన నేతగా ఉన్నారు. ఒక విధంగా చెప్పుకోవాలీ అంటే ప్రజారాజ్యం పునాదులలో ఆయన కూడా ఒకరు.

అంతే కాదు విశాఖలో నాలుగు సీట్లు ప్రజారాజ్యం పార్టీకి రావడానికి గంటా కారణం అని అంటారు. ఆయన 2014 తరువాత తిగిరి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 దాకా అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. గంటా గత మూడున్నరేళ్ళుగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు అనే అంటారు.

ఆయన టీడీపీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం కూడా తగ్గించేశారు. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. అధికార వైసీపీ నుంచి వచ్చిన వత్తిళ్ల వల్లనే ఆయన సైలెంట్ అయ్యారని ప్రచారంలో ఉంది. అలాగే వైసీపీలోకి గంటా చేరుతారు అని ఒక దశలో వినిపించింది కానీ విశాఖ వ్యవహారాలు నాడు చూస్తున్న విజయసాయిరెడ్డి, నాటి మంత్రి అవంతి శ్రీనివాసరావు వల్లనే గంటా వైసీపీలోకి చేరలేకపోయారు అని అంటున్నారు.

అయితే గంటా ఆ తరువాత తన ప్రయత్నాలను విరమించుకుని మంచి కాలం కోసం ఎదురు చూస్తూ వచ్చారని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇపుడు ఆ మంచి రోజులు వచ్చాయని గంటా వర్గీయులు భావిస్తున్నారుట. జనసేనకు ఆదరణ అంతకంతకు పెరుగుతూండడంతో గంటా జనసేనలో చేరి చక్రం తిప్పుతారు అని అంటున్నారు. ఆయనకు చిరంజీవితో ఈ రోజుకూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ మధ్యనే ఆయన హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలసి వచ్చారు.

ఈ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ కి టచ్ లోకి వెళ్లాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే గంటాను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోమని పవన్ గతంలో అన్నారు కానీ ఇపుడు పవన్ ఆయన వస్తే తప్పక ఆదరిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా జనసేనలో చాలా తొందరలో చేరడం ఖాయమనే అంటున్నారు. ఆ రోజు ఏదన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.