Begin typing your search above and press return to search.

పవన్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా ?

By:  Tupaki Desk   |   18 Oct 2022 4:26 AM GMT
పవన్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా ?
X
మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లన్ సక్సెస్ అయినట్లే ఉంది. దాదాపు రెండురోజులు మీడియా, జనాల అటెన్షన్ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవటంలో పవన్ విజయంసాదించారనే చెప్పాలి. మొన్నటి 15వ తేదీన అధికార వికేంద్రీకరణ, మూడురాజదానులకు మద్దతుగా విశాఖపట్నంలో ప్రజాగర్జన జరిగింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైసీపీ మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమం బాగా జరిగిందనే చెప్పాలి.

అయితే ప్రజాగర్జన తాలూకు సక్సెస్ పై మంత్రులు, జనాల్లో చర్చలు జరగకుండా పవన్ అడ్డుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రజాగర్జన ముగిసిన సాయంత్రమే జనసేనాని వైజాగ్ చేరుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణని, పార్టీ నేతలతో సమీక్షలని మూడురోజుల కార్యక్రమం విశాఖలోనే పెట్టుకున్నారు. ప్రజాగర్జన కార్యక్రమం ముగించుకుని మంత్రులు తిరిగి వెళ్ళటానికి మంత్రులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే జనసైనికులు రోజా, జోగిరమేష్ కార్లపై దాడిచేశారు.

దాంతో రచ్చ మొదలైంది. దాడి జరిగిన కొద్దిసేపటికి పవన్ విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి నుండి మొత్తం వ్యవహారమంతా పవన్ చుట్టూనే తిరిగింది. జనాలు, మీడియా అటెన్షన్ అతా ప్రజాగర్జన తాలూకు సక్సెస్ గురించి కాకుండా మంత్రులపై దాడి, పవన్ మీదే నిలబడింది.

దాంతో ప్రజాగర్జన గురించి మాట్లాడుకున్నద పెద్దగా లేదనే చెప్పాలి. అలా 15వ తేదీ సాయంత్రం మొదలైన పవన్ ప్లాన్ 17వ తేదీ సాయంత్రం వరకు కంటిన్యు అయ్యింది. సో మీడియా అటెన్షన్ మొత్తాన్ని తనచుట్టూనే తిప్పుకోవటంలో పవన్ విజయం సాధించారనే చెప్పాలి.

ప్రజావాణి కార్యక్రమం విశాఖలో జరపాలని తాము మూడునెలల ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పింది నమ్మేట్లుగా లేదు. ప్రజావాణి కార్యక్రమాన్ని విశాఖలో జరపాలని నిర్ణయించుకున్నా ప్రజాగర్జన జరిగిన 15వ తేదీనే జరపాలని అనుకోలేదు.

ప్రజాగర్జన తేదీని ప్రకటించిన నాలుగురోజుల తర్వాతే ప్రజావాణి కార్యక్రమం తేదీని జనసైన ప్రకటించింది. సరే రాజకీయమన్నాక ఎత్తులు, పై ఎత్తులు మామూలే కదా. ఈ మొత్తం ఎపిసోడ్ లో జనాల దృష్టిలో పవన్ కు ప్లస్సా లేకపోతే మైనస్సా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పవన్ విజయం సాదించారనే అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.