Begin typing your search above and press return to search.
ఫైజర్ సీఈవో మానవాళికి క్షమాపణలు చెప్పాలా..!
By: Tupaki Desk | 20 Jan 2023 3:30 PM GMTచైనాలోని వ్యూహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా భయ పెట్టిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి యావత్ ప్రపంచం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రెండేళ్లు కరోనాతో మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వైద్యులు.. సైంటిస్టులు కృషి ఫలితంగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాయి.
ఆ తర్వాత కూడా కరోనా వేరియంట్ల రూపంలో ప్రభావం చూపింది. అయితే ఆ తర్వాత వైరస్ క్రమంగా తన ప్రభావం కోల్పోవడం అందుబాటులోకి మెరుగైన వ్యాక్సిన్లు రావడంతో ప్రజల్లో కరోనా భయం పోయింది. ప్రస్తుతం కరోనాకు ముందు పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. అయితే చైనాలో నాసిరకం వ్యాక్సిన్లు ప్రజలకు వేయడంతో దాని ఫలితాన్ని ఆ దేశం అనుభవిస్తోంది.
అయితే కరోనా కట్టడిలో భాగంగా 2020 ఏప్రిల్ లోనే అమెరికా ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. అమెరికా ఆమోదించిన తొలి కోవిడ్ వ్యాక్సిన్ 'ఫైజర్'. ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చెందాలు దేశాలు మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. సుమారు ఒకటిన్నర బిలియన్ డోసుల ఫైజర్ వ్యాక్సిన్ ఆ కంపెనీ విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే ఈ వ్యాక్సిన్ మాత్రం కరోనాపై పెద్దగా ప్రభావం చూపలేదని అందువల్లే చాలామంది కరోనా పేషెంట్లు చనిపోయారనే వాదనలు తరుచూ విన్పిస్తున్నాయి. ఇదే విషయంపై పలువురు జర్నలిస్టులు ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లను ప్రశ్నించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరై బయటికి వస్తున్న ఆయనను జర్నలిస్టులు చుట్టిముట్టి పలు ప్రశ్నలు వేశారు.
కరోనా కట్టడిలో ఫైజర్ వ్యాక్సిన్ ఫలితం గొప్ప లేదని.. మానవాళిని తప్పుదోవ పట్టించి వ్యాక్సిన్లు విక్రయించేందుకు ఫైజర్ కంపెనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్య.. అబద్ద ప్రచారాలతో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్లను విక్రయించి సొమ్ము చేసుకుందన్నారు. కరోనాతో చనిపోయిన వారికి మీరు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
మీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదో చెప్పండి? అని ప్రశ్నించి జర్నలిస్టుకు అల్బర్ట్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని తెలిసినా దాన్ని మీరు రహస్యంగా ఉంచారా? అంటూ ప్రశ్నించారు. ఫైజర్ విక్రయాల ద్వారా కంపెనీకి 2.3 బిలియన్ డాలర్లు వచ్చాయని? ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనుక ఎవరు కమీషన్లు ఇచ్చారని జర్నలిస్టులు నిలదీశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.