Begin typing your search above and press return to search.
బీజేపీ 100 సీట్లు దాటదన్న పీకే మాట నిజమైందా?
By: Tupaki Desk | 2 May 2021 10:30 AM GMTపీకే.. ప్రశాంత్ కిషోర్.. దేశంలోనే పాపులర్ వ్యూహకర్త అయిన ఈయన ఒక్కసారి గురిపెడితే ఆ గురి తప్పదంటారు. ఏపీలో నాడు బలమైన చంద్రబాబును ఓడించడానికి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహాలు ఫలించాయి. జగన్ ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో క్లీన్ స్వీప్ చేశారు. ఇక ఢిల్లీలోనూ కేజ్రీవాల్ ను ఒంటిచేత్తో తన వ్యూహాలతో పీకే గెలిపించారు.
బీజేపీ అంటేనే పడని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన రాజకీయం చేస్తుంటారు. బీజేపీకి మద్దతుగా నిలబడ్డ బీహార్ సీఎం నితీష్ ను కూడా పీకే దూరం పెట్టారు. ఆయన పార్టీకి సైతం రాజీనామా చేసి బయటకు వచ్చారు.
బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకొని పనిచేసే పీకే ఈ ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ లో మమత తరుఫున రాజకీయ వ్యూహాలు రచించాడు. బెంగాల్ లో మమతను ఓడించేందుకు ప్లాన్ చేసిన మోడీషాల వ్యూహాలకు చెక్ పెట్టారు.
విశేషం ఏంటంటే.. ఎన్నికలకు ముందే డిసెంబర్ లోనే ప్రశాంత్ కిషోర్ అసలు బెంగాల్ లో బీజేపీ డబుల్ డిజిట్ దాటదని ప్రకటించాడు. అదే నిజమైంది. అందుకే ఈ ఎన్నికల ఫలితాల వేళ ఆ ట్వీట్ ను పిన్ చేసి మరోసారి గుర్తు చేశాడు పీకే. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
బీజేపీ అంటేనే పడని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన రాజకీయం చేస్తుంటారు. బీజేపీకి మద్దతుగా నిలబడ్డ బీహార్ సీఎం నితీష్ ను కూడా పీకే దూరం పెట్టారు. ఆయన పార్టీకి సైతం రాజీనామా చేసి బయటకు వచ్చారు.
బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకొని పనిచేసే పీకే ఈ ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ లో మమత తరుఫున రాజకీయ వ్యూహాలు రచించాడు. బెంగాల్ లో మమతను ఓడించేందుకు ప్లాన్ చేసిన మోడీషాల వ్యూహాలకు చెక్ పెట్టారు.
బలమైన మోడీ షాలు ఈసారి మమతను ఓడించడానికి ఎంత ప్రయత్నించినా పీకే వ్యూహాల ముందు అవి పారలేదని తెలిసింది. మరోసారి బెంగాల్ లో మమతదే అధికారం అని తేలింది.దీనివెనుక పీకే వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు.