Begin typing your search above and press return to search.
రాజకీయాంశాలు టాలీవుడ్ ను ఇబ్బందికి గురి చేస్తున్నాయా..?
By: Tupaki Desk | 7 Sep 2022 2:30 AM GMTసినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అలనాటి నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకూ అనేక మంది సినీ ప్రముఖులు పాలిటిక్స్ లో ఉన్నారు. బాలకృష్ణ - రోజా - కొడాలి నాని - వల్లభనేని వంశీ - నిరంజన్ రెడ్డి - విజయేంద్ర ప్రసాద్ వంటి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా ఉన్నారు.
ఇక రాజకీయవేత్తలు నిర్మాతలుగా మారి చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెడుతుంటారు. అలానే ఎన్నికలప్పుడు సినిమా వాళ్ళు తమకు నచ్చిన పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ ప్రచారం చేయడం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులంతా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ సినిమాలను రాజకీయాలను వేర్వేరుగా చూడలేం.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి, భాజపా నేత అమిత్ షా ని కలిసిన సంగతి తెలిసిందే. తారక్ - అమిత్ షా భేటీ గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా నడుస్తోంది. అందరూ దీని వెనకున్న రాజకీయ కోణాలను విశ్లేషిస్తున్నారు.
గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్.. ఇప్పుడు బీజేపీ నాయకుడితో మంతనాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తారక్ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తారా? చంద్రబాబు ను దూరం పెడుతూ కావాలనే బీజేపీ ఇలా ఎన్టీఆర్ ను దగ్గర చేసుకుంటోందా? అసలు ఎన్టీఆర్ ఎలాంటి ఆలోచనతో వెళ్ళాడు? అనే చర్చలు జరుగుతున్నాయి.
అమిత్ షా తో తారక్ భేటీ వెనుక బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉన్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అంతేకాదు దీని వెనుక తారక్ సినీ ప్రయోజనాలు కూడా ఉన్నాయని.. ఆస్కార్ కు ఇండియా తరపున RRR మరియు ఎన్టీఆర్ పేర్లు నామినేట్ చేస్తారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ.. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ సంబంధాలపై చర్చ జరిగేలా చేసింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న చిత్ర పరిశ్రమ.. అధికార టీఆర్ఎస్ పార్టీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల అమిత్ షా ను ఎన్టీఆర్ కలవడం.. ఆ వెంటనే యువ హీరో నితిన్ వెళ్లి జేపీ నడ్డా తో సమావేశం అవడం వంటివి దీన్ని దెబ్బ తీస్తాయేమో అనే ప్రశ్నలను లెవనెత్తుతోంది.
ఈ నేపథ్యంలోనే మొన్న 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి సమర్పిస్తున్న ఈ సినిమా ఈవెంట్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. దీనికి ఎన్టీఆర్ అని చీఫ్ గెస్టుగా పిలిచి.. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ తారక్ లేరుని బాలీవుడ్ లో మరోసారి గట్టిగా వినిపించేలా చేయాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ వేడుక రద్దు అయింది.
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో భద్రత కల్పించలేమంటూ ఈవెంట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అమిత్ షా తో తమ అభిమాన హీరో భేటీ అయినందుకే తెలంగాణా ప్రభుత్వం ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వలేదని కామెంట్స్ చేశారు.
ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. సినిమా జనాలు ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసే వ్యూహం ఇలానే కొనసాగితే మాత్రం.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు అశ్వినీదత్ - రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీ పార్టీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇలాంటివన్నీ అటు ఇటు తిరిగి చిత్ర పరిశ్రమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల సినిమా టికెట్ రేట్లు మరియు థియేటర్ల విషయంలో ఏం జరిగిందో ఆల్రెడీ మనం చూశాం. సార్వత్రిక ఎన్నికలకు ఇంక రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. మరి ఈ లోపల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.