Begin typing your search above and press return to search.

పొంగులేటి కూడా జంప్ యేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2022 10:31 AM GMT
పొంగులేటి కూడా జంప్ యేనా?
X
ఈటల రాజేందర్ ను పనిగట్టుకొని వెళ్లగొట్టిన టీఆర్ఎస్ అనుభవిస్తోంది. ఈటల బీజేపీలోకి వెళ్లి గెలిచి ఏకు మేకయ్యాడు. ఏకంగా బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ అయ్యి టీఆర్ఎస్ లోని అసంతృప్తులను లాగేస్తున్నాడు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియక గులాబీ దండులో కలవరం మొదలైంది.

బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై దండయాత్ర చేపడుతుండంతో వలసలు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం సాగుతోంది. వలస నేతల్లో చాలా కాలం నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటూ బీజేపీ వైపు చూస్తున్నారు.

ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ కు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొంగులేటిని కూడా ఈటల బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటిని బీజేపీలో చేరికపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఖమ్మంలో పొంగులేటికి పోటీగా నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక మధ్యలో జిల్లా మంత్రి ఉన్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పొంగులేని నారాజ్ గా ఉన్నారు. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి అనంతరం టీఆర్ఎస్ లో చేరారు.ప్రతిసారి టికెట్ ఆశించి భంగపడుతున్నారు. టీఆర్ఎస్ లో రాజ్యసభ సీటును ఆశించి నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. సరైన అవకాశం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా కూతురు రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా.. పొంగులేటి వెంట టీఆర్ఎస్ నేతలకు బదులు బీజేపీ నేతలు ఉండడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. కమలనాథులతో విడివిడిగా పొంగులేటి ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం విషయంలో కేటీఆర్ హామీ ఇచ్చారని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని పొంగులేటి భావిస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో తన తన పాదయాత్రకు పొంగులేని సిద్ధమవుతున్నారట.. ఇలా సొంతంగా ఎదిగేందుకు.. అవసరమైతే పార్టీ మారేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.