Begin typing your search above and press return to search.
మోడీకి చెక్.. కాంగ్రెస్‌లోకి పీకే.. ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 15 July 2021 3:01 AM GMTప్రశాంత్ కిషోర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జాతీయ రాజకీయాల్లో అత్యంత తక్కువ సమయంలో పుంజుకుని.. దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు మరో సంచలనం దిశగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికలకుముందు.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని పీఎం పీఠం ఎక్కించేందుకు వ్యూహాత్మక రాజకీయాలకు తెరదీసిన రాజకీయ వ్యూహకర్తగా పీకే ఈ దేశంలో అన్ని పార్టీల దృష్టినీ ఆకర్షించారు. అయితే.. తర్వాత కాలంలో మోడీతో విభేదించిన ఆయన ఇప్పుడు ఏకంగా మోడీని గద్దెదింపాలనే కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్న విషయం కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సహా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకునే నేతలతో పీకే కలిసి నడుస్తున్నారు. వారు కూడా పీకేను సెంట్రిక్‌గా చేసుకుని మోడీపై యుద్ధానికి కత్తి దూసేందుకురెడీ అవుతున్నారు. అయితే.. తాజాగా ఈ రాజకీయంలో అనూహ్యం ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా పీకే.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలపై ప్రధానంగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో పీకే వంటి మేధావి సాయం తీసుకోవాలని.. కొన్నాళ్లుగా శరద్ పవార్ వంటివారు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే పీకే నేరుగా సోనియాతో కలిసి చర్చించినట్టు సమాచారం. కానీ, అంతకంటే ప్రధానమైన అంశాలపై మంతనాలు జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీని అధికారం నుంచి తప్పించే సూత్రీకరణను పీకే ప్రతిపాదించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం పీకే ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పార్టీలో ఏ స్థాయిలో ఆయనకు అధికారం ఇవ్వాలనే అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఇదిలావుంటే.. థర్డ్ ఫ్రంట్‌పై ఆశలు పెట్టుకున్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా పీకేతో తరచుగా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లేకుండా 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం సాధ్యపడదని పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలో వారి దూతగా కాంగ్రెస్ అగ్రనేతలతో పీకే భేటీ అయ్యారని, ఈ నేపథ్యంలోనే ఆయనను సోనియా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే అంశాన్ని పరిశీలించారని.. దీనిపై పీకేతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి ఇదే జరిగితే.. మోడీకి వచ్చే ఎన్నికల్లో గట్టి సెగ తగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి పీకే ప్రభావంఏమేరకు పనిచేస్తుందో.. పదేళ్ల నిరాశావాదం నుంచి కాంగ్రెస్ బయటపడుతుందో లేదో చూడాలి.