Begin typing your search above and press return to search.

ఐటీడీపీ ముందు పీకే టీం ఫెయిల్ అయిందా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 11:30 AM GMT
ఐటీడీపీ ముందు పీకే టీం ఫెయిల్ అయిందా?
X
ఐ-టీడీపీ.. ఇది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఐటీ విభాగం. ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం సేక‌రించ‌డం..దానికి అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దడం.. అధినేత చంద్ర‌బాబుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌డం.. ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త‌ను గుర్తించి.. దానిని ప్రచారం చేయ‌డం.. దానికి అనుగుణంగా కార్య‌క్ర‌మాలు రూపొందించ‌డం.. ఈ టీం ప్ర‌త్యేక‌త‌. అయితే.. ఇదే త‌ర‌హాలో వైసీపీకి కూడా పీకే టీంలోని ఐపీఎసీ టీం ప‌నిచేస్తోంది.

దీనికి మంచి పేరు కూడా ఉంది. రాజ‌కీయం క‌న్సెల్టింగ్‌లో బాగా స‌క్సెస్ సాధించి.. పేరు కూడా తెచ్చుకుంది. అయితే, ఇది ఆశించిన మేర‌కు గ‌త ఏడాది నుంచి క‌రెక్ట్‌గా వైసీపీకి ప‌నిచేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. పీకే టీం నేరుగా జిల్లాల కో ఆర్డినేట‌ర్ల‌తో సంబంధం పెట్టుకుంది. అయితే, వీరు అందుబాటులో లేర‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో పీకే విఫ‌ల‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

పీకే టీంలో గ‌తంలో ఉత్త‌రాదికి చెందిన బాగా చ‌దువుకున్న‌వాళ్లను తీసుకుని ప‌నిచేయించారు. ఇది గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బాగానే వ‌ర్కవుట్ అయింది. అయితే, ఇప్పుడు వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి తెలుగువారిని తీసుకున్నారు. వాళ్ల‌తో పీకే టీం హెడ్ రిషి సింగ్ ప‌నిచేయిస్తున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుంద‌నే విష‌యంపై ఆయ‌న దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

అయితే.. దీనిని త‌గ్గించ‌లేక పోతున్నారు. ఇటు సోష‌ల్ మీడియాలోను.. అటు ప్ర‌జ‌ల్లోనూ.. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌నం ఎక్క‌డ విఫ‌లం అవుతున్నాం అని ఈ మ‌ధ్య పీకే టీం స‌భ్యులు మ‌ధ‌న ప‌డుతున్నారు. ఇదే విష‌యాన్ని రిషి సింగ్ కూడా త‌న స‌భ్యుల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఐటీడీపీ సోషల్ మీడియాలో స‌క్సెస్ అవుతోంది. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ముందుంటున్నారు. వాళ్ల యూట్యూబ్ చాన‌ల్స్‌కు వ్యూస్ కూడా పెక్కువ‌గానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో దీనిని గుర్తించిన వైసీపీ పీకే టీం.. మనం ఎంత చేసినా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు... అని త‌న స‌భ్యుల‌ను ప్ర‌శ్నించిన ట్టు స‌మాచారం.

ఐ టీడీపీ వాళ్ల ప‌నితీరు బాగుంద‌ని.. ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని.. వాళ్లు మ‌న‌న‌సు పెట్టి ప‌ని చేస్తు్నార‌ని.. చెప్పాడ‌ని అంటున్నారు. అయితే, వాళ్ల‌తో పోల్చుకుంటే.. వైసీపీ ఐప్యాక్ టీం ఎక్కువ‌గానే తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా చూస్తే.. మాత్రం చాలా వెనుక‌బ‌డి ఉన్న‌ట్టు రిషి సింగ్ చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.