Begin typing your search above and press return to search.

పుతిన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఆ కుర్రాడు ఎవరు?

By:  Tupaki Desk   |   8 March 2022 4:02 AM GMT
పుతిన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఆ కుర్రాడు ఎవరు?
X
సైనిక చర్యలతో ఉక్రెయిన్ ప్రజలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే... సరిగ్గా ఓ 19 ఏళ్ల కుర్రాడు పుతిన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ట్విస్ట్లు మీద ట్విస్టులు ఇస్తున్నాడు.

కేవలం ఒక్క పుతిన్ కు మాత్రమే కాదు.. ఆ దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ఇలాంటి ఝలక్ లే ఇస్తున్నాడు. దీంతో ఆ 19 ఏళ్ల కుర్రాడు ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఆ వ్యక్తి కేవలం పేరు కోసం చేస్తుండడం గమనార్హం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు అని అనుకుంటున్నారా.?

ఆ కుర్రాడి పేరు జాక్ స్వీస్... వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఈ కుర్రాడు ప్రస్తుతం ఒక స్టూడెంట్. అయినా గానీ దేశాధ్యక్షుడినే ఇరకాటంలో పెట్టాడు. ఇంతకీ అబ్బాయి ఏం చేశాడు అనే ఆశ్చర్యంగా ఉందా... మనోడు చేసిన పని అటువంటిది మరి. పుతిన్ సుమారు 20 ఏళ్లకు పైగా రష్యాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రెండు దశాబ్దాల్లో పుతిన్ భారీగా ఆస్తిని పోగు చేసుకున్నాడు. లెక్కలేనన్ని ఆస్తులను కూడా బెట్టుకున్నాడు. ఇదంతా ఆ దేశ చట్టాలను చుట్టాలుగా చేసుకుని సంపాదించాడు. అయితే ప్రస్తుతం ఈ అబ్బాయి పుతిన్‌తో పాటు రష్యన్ ఒలిగార్చ్స్ లకు సంబంధించిన ఆస్తులు కూపీని లాగుతున్నాడు.

ఇలా సేకరించిన ఆ ఆస్తుల చిట్టాను సామాజిక మధ్యమాల్లో పెడుతున్నాడు. అంతేగాకుండా వారికి సంబంధించిన ప్రైవేట్ జట్ల వివరాలు, ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఉంటున్నాయి అనే కీలక విషయాలను షేర్ చేస్తున్నాడు. దీంతో ఈ కుర్రాడు ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఇలా ఆ విషయాలు నలుగురితో పంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి ఒరిగేది ఏమీ లేదు కానీ...ఈ సమాచారం అయితే పుతిన్ తో పాటు ఆ వ్యక్తులకు కూడా భద్రతా పరమైన నష్టం ఏర్పడుతుంది. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో ఇది ఇంకా కీలకంగా మారింది.

ఎందుకంటే ఉక్రెయిన్ పై దాడికి దిగడం అనేది చాలా మందికి గిట్టలేదు. దీంతో ఇప్పటికే చాలామంది చాలా విధాలుగా ట్రై చేశారు యుద్ధం ఆపుదామని, కానీ ఏమీ చేయలేక కామ్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో వారి భద్రత ప్రశ్నార్ధకంగా మారడం కీలకం కానుంది.

ఇదంత పెరిగిన సాంకేతికతను ఉపయోగించి చేస్తున్నాడు. వీరు మాత్రమే కాకుండా ఆఖరికి ప్రపంచ కుబేరల జాబితాలో ఎప్పుడు కనిపించే ఎలన్ మస్క్ ని కూడా ఈ కుర్రాడు బాధితుల్లో ఒకరు అని పేర్కొంటున్నారు.