Begin typing your search above and press return to search.
రాహుల్ ఫెయిల్యూర్ కేవలం వర్క్ ఫ్రం హోమ్ యేనా?
By: Tupaki Desk | 2 March 2021 11:30 AM GMTదేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో బీజేపీ మీద కోపం ప్రజల్లో పెరిగిపోతోంది. అయినా ఓటర్లకు ప్రత్యామ్మాయం లేక బీజేపీకే ఓటు వేయాల్సిన ఖర్మ వారికి దాపురించింది. ఓటర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు.. ఎందుకంటే 100 ఏళ్ల పైబడిన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు వృద్ధ జంబూకాల వలన అధికారం దక్కడం అసాధ్యం అని తెలుస్తోంది. వీరితో వీధి పోరాటాలు చేయాలని అంటున్నా కాంగ్రెస్ కు సాధ్యపడడం లేదు. సోనియా గాంధీ మాత్రం ఇంకా రాహుల్ గాంధీని చాక్లెట్ బాయ్ మాదిరి చూస్తూ క్షేత్రసాయిలోకి మాస్ లీడర్ గా పంపలేకపోతోంది.
‘ఎవరో కాంగ్రెస్ నేతలు మన పేరు మీద కష్టపడుతారని.. మనం అధికారం అనుభవిద్దాం’ అనే ధోరణిలో సోనియా, రాహుల్ రాజకీయం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు వస్తున్న సర్వేల్లో ‘అస్సాంలో కాంగ్రెస్ కు.. బీజేపీకి కేవలం 1-2శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందంట.. సీట్లలో తేడా కేవలం 15 సీట్లు మాత్రమే ఉందంట.. అయినా కాంగ్రెస్ మాత్రం పెద్దగా స్పందించడం లేదట.. వాళ్లు ఎవరో కష్టపడుతున్నారని.. మనం మాత్రం వర్క్ ఫ్రం హోం చేద్దాం అని ధోరణిలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అధికారం కోసం కృషి చేయడం లేదన్న ప్రచారం ఉంది.
అస్సాంలో అధికారంలో చేరువలో ఉన్నా కాంగ్రెస్ నిర్లిప్తత చూసి.. ఇలా చేస్తే ఎలా అని కాంగ్రెస్ వాదులు తలపట్టుకుంటున్నారు. బీజేపీ మాదిరి ‘మనం వీధి పోరాటాలు చేద్దాం’ అని ‘యూత్ ను ఎంకరేజ్ చేద్దాం’ అని అంటుంటే సోనియా గాంధీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని టాక్.
ఇలా అయితే బీజేపీని ఇప్పటికీ దెబ్బతీయలేరు అని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారట.. ఇప్పుడు బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నా కాంగ్రెస్ బూత్ స్థాయిలో వర్కవుట్ చేసుకోవడం లేదు అని ఆ పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.