Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ఇండియాలో లేకుండా చేయాలని రాహుల్ ప్లానా?

By:  Tupaki Desk   |   30 Aug 2020 9:30 AM GMT
ఫేస్ బుక్ ఇండియాలో లేకుండా చేయాలని రాహుల్ ప్లానా?
X
భారతదేశంలో పాలక బీజేపీ నేతలు విచ్చలవిడిగా విద్వేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. కానీ ఇదే ఫేస్ బుక్ వాట్సాప్ లు చూసీ చూడనట్లు వదిలేస్తుందని.. చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో సంచలన కథనం ప్రచురితమైంది. భారత్ లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్ బుక్ ఇలా చేస్తోందని ఆ కథనంలో రాశారు. ఇది పెను సంచలనమై దేశంలోని పలు పత్రికలు, వెబ్ సైట్లు ఇదే విషయంపై బీజేపీపై విమర్శలు చేశాయి.

ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లను నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఫేస్ బుక్.. ఇండియాలో అత్యధిక మంది వాడుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్. ఫేస్ బుక్ లో భారతీయుల అకౌంట్స్ కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. పొలిటికల్ గా బీజేపీ పెద్ద ఎత్తున ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేపించుకుంటోందని టాక్. కులాల పరంగా.. మతాల పరంగా బీజేపీ ప్రసంగాలు ఉన్నా.. వాటిని ఫేస్ బుక్ ప్రమోషన్ చేస్తోందని.. ఆ ట్రాప్ లో బీజేపీ ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఫేస్ బుక్ వలన బీజేపీ లాభపడుతోందని.. ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ దెబ్బతింటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట.. ఫేస్ బుక్ ని ఎలాగైనా ఇండియాలో లేకుండా చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ ఫేస్ బుక్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.