Begin typing your search above and press return to search.
కే.ఏ.పాల్ ని కొట్టేలా వడివేలు కామెడీలేమిటి?
By: Tupaki Desk | 14 March 2020 5:16 AM GMTప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. శాంతిదూత కే.ఏ పాల్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. గత ఎన్నికల సమయంలో పాల్ ప్రత్యర్ధులపై ఎలాంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారో తెలిసిందే. వాటిపై సోషల్ మీడియాలో మీమ్స్ వేడెక్కించాయి. పాల్ వ్యవహారికంపై కామెంట్లు చూసి జనాలు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తన సొంత యూ ట్యూబ్ ఛానల్ లో పాల్ చేసే కామెడీ సీన్లు చూసి ప్రజలు ఎంతగా ఎంటర్ టైన్ అవుతున్నారో చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలి భాషతో నెటిజనులను ఆకట్టుకోవడం పాల్ కే చెల్లింది.
2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలను పాలించే ముఖ్యంమత్రి నేనే! అంటూ పాల్ చేసిర రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా పాల్ కామెడీనే మించిపోయేలా వ్యాఖ్యానించాడు తమిళ హాస్య నటుడు వడివేలు. 2012లో నేనే సిఎం...రజనీకాంత్...విజయ్ కాంత్...గజనీకాంత్ నయ్..నేనే సీఎం అనేసాడు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో నేనే సత్తా చూపిస్తానంటూ ధీమాను వ్యక్తం చేసాడు. అలాగే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపైనా స్పందించాడు. పార్టీకి ఒకరు.. పాలనకు ఒకరు! అంటూ రజనీ తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఆయనలో క్లారిటీ లేదు. రాజీకాయల్లోకి వచ్చేలా? ఉంటే ఆయనే సిఎంగా బరిలోకి దిగొచ్చుగా? అంటూ చమత్కరించాడు.
అయితే వడివేలు తనకు తానే సీఎం అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించడంపై రజనీ ఫ్యాన్స్ చెలరేగుతున్నారు. నెటిజనులు ఈ కామెడీ బాగుందయో అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో పాల్ చేసిన వ్యాఖ్యల్లానే నీ మాటలు ఉన్నాయంటూ కొందరు ఫ్యాన్స్ ఉదహరిస్తున్నారు. మరి వడివేలు వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కోలీవుడ్ లో వడివేలు రకరకాల వివాదాల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ తోనూ వడివేలు వైరంపై ఆసక్తికర చర్చ సాగింది. రజనీ ఫ్యాన్స్ వడివేలు వ్యవహారికంపై ప్రతిసారీ సీరియస్ గానే స్పందిస్తుంటారు.