Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ సీఎం కావడానికి రాజీవ్ గాంధీ కారణమా...?

By:  Tupaki Desk   |   20 Aug 2022 3:31 PM GMT
ఎన్టీయార్ సీఎం కావడానికి రాజీవ్ గాంధీ కారణమా...?
X
ఎన్టీయార్ తెలుగు సినిమా సూపర్ స్టార్. ఆయన తొలి తరం విశిష్ట నటుడు. ఆయన వెండి తెర మీద మెప్పించని పాత్ర లేదు. సాంఘీకాలు, పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మక సినిమాలు ఇలా చాల ఎన్టీయార్ చేశారు. రాముడు, క్రిష్ణుడు అంటే ఆయనే. ఒక నటుడు అతి తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేశారు అంటే అది ఎన్టీయార్ అనే చెబుతారు. ఇంతటి ఎన్టీయార్ కి సామాజికసేవ తపన అయితే ఉంది కానీ రాజకీయాల మీద చివరి దాకా ఇష్టం లేదు అనే అంటారు. ఆయన షూటింగుల టైమ్ గ్యాప్ లో ఎవరైనా సాటి నటులు రాజకీయాల గురించి మాట్లాడితే ముందు సీన్ కి డైలాగ్స్ వల్లె వేసుకోండి. ఎందుకొచ్చిన రాజకీయాలు అని సలహా ఇచ్చేవారు అని కూడా చెబుతారు.

అలాంటి ఎన్టీయార్ కి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలగడమే ఒక పెద్ద షాక్. ఇక 1980లలో సర్ధార్ పాపారాయుడు సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర వేస్తున్నపుడు రాజకీయ ప్రవేశానికి కోరిక అలా కలిగింది. దాంతో ఆయన రెండేళ్ళ తేడాలో పార్టీని పెట్టారు. ఇక ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చి కేవలం తొమ్మిది నెలలు తిరిగేసరికి సీఎం అయిపోయారు. అది ఒక అద్భుతం. ప్రపంచ రికార్డు. దాన్ని ఎవరూ తిరగరాయలేకపోయరు.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చే కాలం కాంగ్రెస్ కకావికలం అయి ఉంది. వరసబెట్టి ముఖ్యమంత్రులను మారుస్తూ పోతున్నారు. ఇది ఒక బిగ్ ఇష్యూ అయితే తెలుగు వారి ఆత్మగౌరవం అన్న పవర్ ఫుల్ నినాదాన్ని ఎన్టీయార్ కి దక్కింది అంటే దానికి నాటి కాంగ్రెస్ యువ నేత. ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ ఉన్నారు అన్నది చరిత్ర చెబుతున్న విషయం.

రాజీవ్ గాంధీ అప్పట్లో అంటే 1980లలో ఓసాఅరి హైదరాబాద్ కి వచ్చారు. ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు ఆయన బేగంపేట విమానాశ్రమంలో బాగానే స్వాగతం లభించింది. అయితే ఆనాటి కాంగ్రెస్ సీఎం టంగుటూరి అంజయ్య ఎయిర్ పోర్టు కి వచ్చినపుడు రాజీవ్ గాంధీ ఆయన పట్ల కొంత కోపంగా ప్రవర్తించారు అన్నది ప్రచారంలో ఉన్న విషయం. అది కాస్తా నాటి దిన పత్రికల్లో భారీ ఎత్తున హైలెట్ అయింది.

రాజీవ్ గాంధీ ఒక తెలుగు సీఎం మీద ఇలా వ్యవహరించారు అన్నది నాటి ప్రింట్ మీడియా హైలెట్ చేసింది. అంతే ఎన్టీయార్ కి అది అతి పెద్ద అస్త్రంగా అయిపోయింది. తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెడతారా. వారికి ఊడిగం చేస్తారా అంటూ ఎన్టీయార్ ఉమ్మడి ఏపీ నలుచెరగులా తిరిగి ఇచ్చిన గంభీరమైన స్పీచెస్, ఆయన హావభావాలు తెలుగు వారిని కట్టిపడేసాయి. ఇక ఇది ఒక ఎమోషనల్ ఇష్యూగా మారిపోయింది.

దాంతో తెలుగు వారి సత్తా పౌరుషం చాటాలంటే కాంగ్రెస్ ని ఓడించండి అన్న ఎన్టీయార్ పిలుపు బ్రహ్మస్త్రంగా పనిచేసి ఆయన్ని సీఎం గా చేసి పారేసింది. అయితే ఇంతటి పవర్ ఫుల్ వెపన్ లాంటి నినాదం వెనక రాజీవ్ గాంధీ బేగం పేట టూర్, అక్కడ జరిగిందని చెబుతున్న ఒకానొక ఇష్యూవే కారణం.

రాజీవ్ గాంధీ తరువాత కాలంలో దేశానికి ప్రధాని అయ్యారు. కానీ ఏపీలో కాంగ్రెస్ కోటలను బద్ధలు కొట్టింది తన దురుసు వ్యవహారశైలి అని ఆయన గుర్తించారో లేదో కానీ అంతకు అంతా జరిగి ఈ రోజుకు ఈనాటికి కాంగ్రెస్ ఎంతలా ఉమ్మడి ఏపీలో కుదేల్ అయిందో తెలిసిన విషయమే. అయితే కానీ బీటల వెనక బీజాలు మాత్రం నాడు ఆయన‌ నాటివవే అంటే అందులో సత్యముందిగా.