Begin typing your search above and press return to search.

టీడీపీ దగ్గర ఆధారాలున్నాయా ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:33 AM GMT
టీడీపీ దగ్గర ఆధారాలున్నాయా ?
X
గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ వ్యవహారంపై తొందరలోనే కోర్టు వేదికగా ఫైటింగ్ జరగబోతోందా ? తెలుగుదేశం పార్టీ నేతల తాజా ప్రకటన చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పట్టుబడ్డ హెరాయిన్ కు జగన్మోహన్ రెడ్డి అండ్ కో లింకులు పెట్టేస్తు టీడీపీ నేతలు కొద్దిరోజులుగా బురదచల్లేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇదే విషయమై డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ పట్టుబడ్డ హెరాయిన్ కు ఏపికి సంబంధం లేదని చెప్పారు.

ఇదే సమయంలో హెరాయిన్ విషయంలో దర్యాప్తు చేసిన డీఆర్ఐ, ఎన్ఐఏ అధికారులు కూడా పట్టుబడ్డ హెరాయిన్ కు ఏపికి సంబంధం లేదని ప్రకటించాయి. దర్యాప్తు సంస్ధలు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించినా చంద్రబాబు అండ్ కో మాత్రం పోలీసులు, వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తునే ఉన్నారు. హెరాయిన్ కు ఏపీకి సంబంధంలేదని ప్రకటించిన డీజీపీ మీద కూడా టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా డీజీపీ ప్రకటనను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.

దీంతో మంటెత్తిన డీజీపీ టీడీపీ నేతలకు నోటీసులు పంపారు. డీజీపీ పంపిన నోటీసులకు సమాధానంగానే హెరాయిన్ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటు టీడీపీ నేతలు సవాలు విసురుతున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ కు ఏపికి లింకులున్న విషయం వాస్తవం కాదా అంటు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు విచారణలో హెరాయిన్ కు ఏపి లోని వైసీపీ నేతలకు ఉన్న లింకులకు ఆధారాలను అందచేస్తామంటున్నారు.

రాష్ట్రంలోని మాదకద్రవ్యాల గుట్టుమట్లు, వైసీపీ నేతల ప్రమేయంపై తమ దగ్గరున్న అన్నీ ఆధారాలను కోర్టుకు అందచేస్తామంటున్నారు. నిజానికి టీడీపీ నేతల దగ్గర ఆధారాలున్నట్లు ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే నిజంగానే టీడీపీ నేతల దగ్గర ఆధారాలుంటే ఈపాటికే డీఆర్ఐ, ఎన్ఐఏ దర్యాప్తు అధికారులకు అందించుండేవారే. అలాకాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై బురదచల్లటమే టర్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టే పదే పదే మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

నిజంగానే టీడీపీ నేతల దగ్గర గనుక మాదకద్రవ్యాల గుట్టుమట్లు, పట్టుబడ్డ హెరాయిన్ తో ఏపిలోని వైసీపీ నేతలకు ఉన్న లింకులపై ఆధారాలను కోర్టుకు అందచేస్తే అపుడు విషయం బాగా సీరియస్ అవుతుంది. మరాపని టీడీపీ నేతలు నిజంగానే చేయగలరా ? అన్నది అనుమానమే. ఎందుకంటే ఆధారాలు చూపించటం కాకుండా కేవలం బురదచల్లటమే పనిగా పెట్టుకున్నది కాబట్టి టీడీపీ నేతల దగ్గర ఆధారాలున్నాయని ఎవరు అనుకోవడం లేదు. మరి కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపిస్తారనే విషయంపై ఆసక్తి పెరిగిపోతోంది. చూద్దాం కోర్టులో ఎలాంటి ఆధారాలను టీడీపీ నేతలు చూపిస్తారో.