Begin typing your search above and press return to search.
రోజా బన్నీ ఫ్యాన్ నా... ?
By: Tupaki Desk | 21 Dec 2021 3:30 PM GMTరోజా అద్భుతమైన నటీమణి. ఆమె తొంబై దశకంలో అనేక సినిమాలు నటించి స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకున్నారు. ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నా కూడా సినిమాటిక్ వాసనలు ఎక్కడా పోలేదు అన్న మాట ఉంది. ఇక ఆమె డైలాగ్స్ లో వరసబెట్టి పంచులు పేలుతాయి. అంతే కాదు, లేటెస్ట్ మూవీస్ లోని టాప్ స్టార్స్ డైలాగ్స్ ని కూడా ఆమె సందర్భానుసారం తన స్పీచులలో ఉపయోగిస్తారు.
అలా రోజా బన్నీ నటించిన మూవీ పుష్ప సినిమాలోని తగ్గేది లే డైలాగ్ ని ఇపుడు తరచుగా పార్టీ సభల్లో వాడేస్తున్నారు. దానికి మంచి రియాక్షన్ కూడా వస్తూండడంతో రోజా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోజా బన్నీ మ్యానరిజం తో తగ్గేది లే అంటూ చెబుతున్న డైలాగ్ ని చూసిన వారు ఆమె బన్నీ ఫ్యాన్ నా అని అనుకోవడం కూడా జరుగుతోంది.
ఇక రోజా తగ్గేది లే డైలాగ్ మాత్రం రాజకీయాల్లో చూసుకుంటే రెండు రకాలుగా చెప్పుకోవాలి. మొదట వైసీపీకి అసలైన ప్రత్యర్ధులు అయిన టీడీపీ వారి మీద వేసిన పంచ్ డైలాగ్స్ గానే వాటిని చూడాలి. అదే టైమ్ లో రోజాకు వైసీపీలో కూడా కొందరు శత్రువులు ఉన్నారు. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో కూడా పార్టీలోనే రైవల్స్ ఉన్నారు.
వారి విషయంలో కూడా రోజా ఎక్కడా ఏ తీరునా తగ్గేది లే అంటున్నారు అన్న టాక్ ఉంది. రోజాకు యాంటీగా మరో బలమైన వర్గం నగరిలో ఉంది. వారి విషయంలో ఎప్పటికపుడు రోజా తన అధికార బలంతో గట్టిగానే రియాక్షన్ ఇస్తూ పోతున్నారు. ఏ విషయంలోనూ ఏ కోశానా స్పేర్ చేయను, అసలు తగ్గేది లే అన్నట్లుగానే ఆమె రాజకీయ వైఖరి ఉంటుంది.
ఇపుడు కూడా ఆమె బన్నీ స్టైల్ లో చెప్పిన తగ్గేదిలే అన్న డైలాగ్ ని ఎవరికి వారు తోచిన రీతిన నిర్వచించుకుంటున్నారు. ఆమె సొంత పార్టీ వారికే ఝలక్ ఇచ్చేలా తగ్గేది లే అంటున్నారని కొందరు అంటూంటే ఇంటా బయటా పార్టీలకు ఆమె చేస్తున్న హెచ్చరికగా కూడా చెబుతున్నారు.
ఇక రోజా తనది పాతికేళ్ల రాజకీయ ప్రస్థానమని చెప్పుకుంటున్నారు. అదే టైమ్ లో రెండు సార్లు నగరి ఎమ్మెల్యేగా కూడా గెలిచాను అని ఎవరికో అవసరమైన వారికే గుర్తు చేస్తున్నారు. ఈసారి మంత్రి పదవి రేసులో ఆమె ఉన్నారు. ఆమె ప్రధానమైన పోటీ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా అసలు తగ్గేది లే అన్నట్లుగానే ఆమె సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.
మొత్తానికి రోజా బన్నీ ఫ్యాన్ గా మారిపోయి తగ్గేది లే అంటూ కొడుతున్న భారీ డైలాగ్ మాత్రం వైసీపీలో పెద్ద చర్చకే తావిస్తోంది. మినిస్టర్ రోజా అనిపించుకోవడానికి ఆమె ఎక్కడా తగ్గేలా లేరు అన్నదే లేటెస్ట్ టాక్. అలాగే థాంక్స్ టూ బన్నీ అనుకుంటూ రోజమ్మ ఆయన డైలాగును తనకు వీలుగా బాగా వాడేసుకుంటున్నారన్న మాటేగా.