Begin typing your search above and press return to search.
ఈమె మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారా ?
By: Tupaki Desk | 15 Feb 2022 7:13 AM GMT జిల్లాలో ఈ విషయంపైనే రెండు పార్టీల్లోను చర్చించుకుంటున్నారట. ప్రజాసేవ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడంతా నేతలు సొంత లాభం మాత్రమే చూసుకుంటున్నారు. కాకపోతే పైకి మాత్రం ప్రజాసేవని చెప్పుకుంటారంతే. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీ ఎంపీ బుట్టా రేణుక గురించే ఇదంతా.
2014లో అనూహ్యంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చి వైసీపీ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారే గెలిచారు. పైగా మంచి వాగ్దాటి తో పాటు మనిషి కూడా బాగుంటారు కాబట్టి పార్టీలోను బయటా ఆమెకు క్రేజు వచ్చేసింది.
ఎప్పుడైతే తనకు క్రేజు వచ్చేసిందో తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. దాంతో ప్రతిపక్షంలో ఉన్న తన పార్టీని కాదని టీడీపీలోకి చేరిపోయారు. అప్పటికే తన భర్త టీడీపీలో ఉండటంతో ఆమెకు చంద్రబాబునాయుడు అండ దొరికింది. సాంకేతికంగా ఆమె టీడీపీలో చేరకపోయినా తన మద్దతుదారులను పార్టీలో చేర్చేశారు. అలాగే ఆమె టీడీపీ సమావేశాల్లో పాల్గొనేవారు. ఢిల్లీలో కూడా టీడీపీ ఎంపీలతోనే ఉండేవారు.
సీన్ కట్ చేస్తే ఆమెకు చంద్రబాబు ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. కర్నూలు ఎంపీగా టికెట్ ఇస్తానని లేదా అడిగిన చోట ఎంఎల్ఏగా టికెట్ ఇస్తానని ముందు చెప్పి చివరకు చేతులెత్తేశారు. చివరి నిముషంలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీగా ఇచ్చారు.
సరే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో బుట్టాలో అంతర్మధనం మొదలైంది. దాంతో కొంతకాలానికి టీడీపీలో ఉండలేక జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని మళ్ళీ వైసీపీలో చేరిపోయారు. చేరేముందు బహిరంగంగా తప్పుచేశానని చెప్పి చెంపదెబ్బలు కూడా వేసుకున్నారు.
అలాంటిది ఇపుడు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారట. ఎందుకంటే వైసీపీలో ఆమెకు పెద్దగా విలువ దక్కటం లేదట. ఫిరాయింపుదారులకు విలువ ఉండదనే విషయాన్ని బుట్టా ఇంకా తెలుసుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీలో టికెట్ ఇవ్వలేదని, విలువ లేదనే రెండోసారి వైసీపీలో చేరారు. అలాంటిది ఇపుడు వైసీపీలో కూడా విలువ లేదని టీడీపీ వైపు చూస్తున్నారట. మరి టీడీపీలో మాత్రం విలువ ఇస్తారని ఎలా అనుకుంటున్నారో ఆమెకే తెలియాలి.