Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నికల్లో అసలుసిసలు బకరా ఆమెనేనా?

By:  Tupaki Desk   |   2 May 2021 10:30 AM GMT
తిరుపతి ఉప ఎన్నికల్లో అసలుసిసలు బకరా ఆమెనేనా?
X
అంచనాలు నిజమయ్యాయి. ఊహించిందే నిజమైంది. ఏపీలో సీఎంజగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదన్న విషయం తాజా ఉప ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోంది. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్ని చూస్తే..వైసీపీ అభ్యర్థికి 2.34లక్షల ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి సుమారు 1.3 లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు గురుమూర్తి లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకెళుతున్నారు. మరిన్నిరౌండ్లను లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో మెజార్టీ మరింత పెరగటం ఖాయమని చెప్పక తప్పదు. ఇంతకూ తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తాజాగా ఒక విషయాన్ని స్పష్టం చేసింది.

ఇంతకాలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత పెద్దగా లేదన్న మాట వినిపించేది. అయితే.. ఈ వాదనలో నిజం లేదన్న విషయం తిరుపతి ఫలితం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. తొలుత తిరుపతిలో జనసేన తన అభ్యర్థిని బరిలో నిలపాలని భావించింది. ఈ విషయంలో పవన్ కాస్త నొచ్చుకున్నట్లుగా చెబుతారు. వాస్తవంగా కూడా బీజేపీతో పోలిస్తే.. జనసేనకే ఎక్కువ బలం ఉంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాన్ని చూసినప్పుడు బీజేపీఅభ్యర్థి రత్నప్రభకు కేవలం 23వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇప్పటివరకు (మధ్యాహ్నం 2 గంటలవరకు) విడుదలైన ఫలితాల సరళిని చూస్తే.. అధికార వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలోకేవలం పది శాతం కంటే తక్కువ ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంతకుమించిన అవమానం ఇంకేం ఉంటుంది. ఏపీలో బీజేపీ బలం ఏమిటన్న విషయాన్ని తాజా ఫలితం స్పష్టం చేసినట్లే. ఒకవేళ.. బీజేపీకి బదులుగా జనసేన బరిలో నిలిచి ఉంటే.. మరికాస్త ఎక్కువ ఓట్లు వచ్చేవి తప్పించి.. కనీసం రెండో స్థానంలో ఉండేది కాదు. అదే జరిగి ఉంటే.. జనసేన వెనక్కి తగ్గాల్సి ఉండేది. తాజా ఎపిసోడ్ చూస్తే.. బీజేపీ కోసం పవన్ తన సీటును త్యాగం చేశారన్న మాట నిలుస్తుంది. రానున్న రోజుల్లో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశాన్ని తిరుపతి ఉప ఎన్నికల తగ్గించిందని చెప్పాలి. ఓడే సీటును త్యాగం చేసిన భావన కలిగించటంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. పవన్ ముందుచూపుతో వ్యవహరించినట్లే.

తిరుపతి ఉప ఎన్నికల్లో అడ్డంగా బుక్ అయ్యింది.. పూర్తిస్థాయిలో బకరాగా మారింది మాత్రం మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభగా చెప్పాలి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నవిషయాన్ని ఆమె ఎక్కువగా ఊహించుకోవటం.. తీరా ఫలితం చూస్తే దారుణమైన రీతిలో ఉండటం చూస్తే.. తిరుపతిఉప ఎన్నికల ఎపిసోడ్ లో ఆమెకు మించిన బకరా మరెవరూ ఉండరని చెప్పాలి. ఏం చెప్పి ఆమెను బీజేపీ నాయకత్వం తిరుపతి బరిలోకి దింపిందో కానీ.. ఆమె ఇమేజ్ దారుణంగా దెబ్బ తిందని చెప్పక తప్పదు.