Begin typing your search above and press return to search.
విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య ఏదో జరుగుతోందా?
By: Tupaki Desk | 19 Sep 2021 5:32 AM GMTవిజయవంతంగా జట్టు ముందుకు సాగినంత వరకూ ఆడింది ఆట..పాడింది పాటగా ఉంటుంది. అదే తేడా కొట్టిందే అంతే సంగతులు.. ఈ విషయం తెలుసు కాబట్టే.. ఫాం కోల్పోయిన ఎంఎస్ ధోని కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని ఉన్న ఫళంగా నాడు సూపర్ ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పాడు. దీంతో భారత క్రికెట్ లో నాడు నాయకత్వ బదిలీ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా సాగింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ ఫాం కోల్పోయాడు. అతడి సారథ్యంలో టీమిండియా ఒక్క ఐసీసీ ప్రపంచకప్ కూడా గెలవలేదు. ధోని సారథ్యంలో నెగ్గిన ట్రోఫీలే ఇప్పటిదాకా ఉన్నాయి. 2013 నుంచి టీమిండియా ఒక్క కప్ కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా.. టీమిండియా తరుఫున విజయాలను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. ఈ విషయం చెప్పడంతోనే ప్రపంచ టీ20 కప్ వరకు తనకు అవకాశం ఇవ్వాలని కోహ్లీ అడిగాడని.. అందుకే ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి దిగిపోనున్నట్టు తెలిపారు.
ఈ పరిణామాలన్నీ చూశాక టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినట్లు అనిపిస్తోందని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడని అనిపిస్తోందన్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐకి మధ్య విభేదాలున్నాయని.. దాంతోనే కోహ్లీ టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని అనుమానం కలుగుతోందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతుందని అనుకోలేమని అంటున్నారు.
అయితే కోహ్లీ లాంటి ప్రపంచ బ్యాట్స్ మెన్ ఏ జట్టుకు లేదు. భారత్ క్రికెట్ కు కోహ్లీ గొప్ప ఆస్తి. కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతడి బ్యాటింగ్ ను మెరుపరిచేందుకు సహకరిస్తుంది.. విరాట్ టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినా దేశం తరుఫున పరుగులు చేస్తూనే ఉండాలి. కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేందుకు రోహిత్ శర్మకు మించిన అర్హుడు మరొకరు లేరు అని సందీప్ పాటిల్ లాంటి క్రికెట్ మాజీలు కూడా చెబుతున్నారు.