Begin typing your search above and press return to search.
సోము వీర్రాజు ప్యాకేజి స్టార్ నా...?
By: Tupaki Desk | 20 Oct 2022 7:30 AM GMTఆయన ఘనత వహించిన బీజేపీ వంటి జాతీయ పార్టీకి ప్రెసిడెంట్. ఆరెస్సెస్ నుంచి ఆయన కాషాయ దళంలో ఓనమాలు దిద్దుకుని బీజేపీలో వరిష్ట నేతగా ఉన్న కారణం చేత పార్టీ పగ్గాలు రెండేళ్ల క్రితం ఆయనకు అప్పగించారు. అయితే సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీ పరిస్థితి మరింతగా దిగజారింది అని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ పడుతున్నాయి. సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా వచ్చాక ఏపీలో రెండు ఉప ఎన్నికలు ఒక లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే అన్నింటా బీజేపీకి డిపాజిట్లు పోయాయి. ఒక విధంగా ఏపీలో బీజేపీకి జనసేనతో దోస్తీ ఉంది.
అది కూడా 2020 జనవరి లో సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ కాక ముందే కుదిరిన దోస్తీ. మరి ఆ దోస్తీని సోము వీర్రాజు నిలబెట్టుకున్నారా, పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అని పక్కన పెట్టుకుని ఏపీలో బీజేపీని పరుగులు తీయించాల్సిన చోట సోము చక్కగా పనిచేశారా అంటే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతమే కాదు అని చెబుతోంది. ఏపీలో బీజేపీ ఏ విధంగా చూసినా ఎత్తిగిల్లడంలేదు. పొరుగున ఉన్న తెలంగాణాలో చూస్తే బీజేపీ అధికార టీయారెస్ తో ఢీ కొడుతోంది. అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా లేకుండా ప్రజలలో తామే ఆల్టర్నేషన్ అని చెప్పుకుంటోంది.
వరసబెట్టి రెండు ఉప ఎన్నికలను గెలిచింది. మరి అదే ఏపీలో చూస్తే బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుగా మారింది అంటున్నారు. ఏపీ బీజేపీకి 2019లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇపుడు ఎలా చూసుకున్నా ఒక శాతం కంటే తక్కువే ఓట్లు వస్తాయని అంటున్నారు. మరి ఏపీలో బీజేపీని పట్టాలు ఎక్కించే పనిలో సోము వీర్రాజు ఎందుకు వెనకబడ్డారు అంటే ఆయన మీద రకరకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఏపీలో అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నారని కూడా గుసగుసలు పోయే వారు పోతున్నారు.
అందుకే ఆయన బయటకు ఎన్ని విమర్శలు చేసినా వైసీపీలో లోపాయికారి దోస్తీని కంటిన్యూ చేస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా బీజేపీ నేతలు కొందరు మాటలు చూస్తే సోము మీద వారు ఎంత గుర్రుగా ఉన్నరో అర్ధమవుతుంది. సోము వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయారు అని అనే వాళ్ళూ ఉన్నారని గుసగుసలు పోతున్నారు. ఆ విధంగా చూస్తే సోము వీర్రాజు కూడా ఒక ప్యాకేజీ స్టార్ అనే అంటున్నారుట.
మరి దీనికి సోము వీర్రాజు కానీ ఆయన వర్గం కానీ ఎలాంటి సమర్ధింపు చేసుకుంటారో తెలియదు కానీ ఏపీలో సోము ప్రెసిడెంట్ అయ్యాక మాత్రం బీజేపీ దారుణంగా దిగజారింది అనే అంటున్నారు. ఈ విషయంలో పార్టీని పటిష్టం చేయలేకపోయారు అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక సోము ముందర పార్టీకి ప్రెసిడెంట్ చేసిన కన్నా లక్ష్మీ నారాయణ అయితే సోము వీర్రాజుతోనే సమస్యలు అన్నీ అని ఏకంగా మీడియా ముందే కుండ బద్ధలు కొట్టారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు సోము వీర్రాజు వైసీపీ వారిని నొప్పించకుండా ఉండాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి పోరాటాలు చేయలేదు అని కూడా అంటున్నారుట. ఏది ఏమైనా ఏపీలో ప్యాకేజీ స్టార్లు చూడబోతే చాలా మంది ఉన్నారని అది పెద్ద లిస్ట్ గానే మారుతోంది అని సెటైర్లు పడుతున్నాయి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.