Begin typing your search above and press return to search.
సునీత ప్రాణాలకు ముప్పుందా?
By: Tupaki Desk | 30 Jan 2020 4:27 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్యపై ఆయన కుమార్తె సునీత ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెను చర్చగా మారింది. ఇందులో పలువురి పేర్లను ప్రస్తావించిన ఆమె.. అనుమానితుల జాబితాలో చేర్చాలని చెప్పటమే కాదు.. ఎందుకు చేర్చాలన్న విషయాన్ని వివరంగా ప్రస్తావించారు.
ఈ పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి హత్య జరిగిన ఇన్నాళ్ల కు నోరు విప్పిన సునీత.. తాజాగా చేసిన వ్యాఖ్యల్ని మరింత సంచలనంగా మారుతున్నాయి. తన తండ్రిని చంపిన వాళ్లు.. తనను.. తన భర్తను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2019 మార్చి 15న తన తండ్రి హత్య కు గురయ్యారని.. దర్యాప్తు వేగంగా సాగటానికి తాను.. తన భర్త పోలీసులకు సహకరిస్తున్నామని.. అయినా హంతకుడు ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారంటున్న ఆమె.. ఇలాంటి పరిస్థితుల్లో తమకు.. తమ కుటుంబ సభ్యుల భద్రత పై తమకు ఆందోళన గా ఉందన్నారు.
తన తండ్రిని హత మార్చిన వారు తమను కూడా టార్గెట్ చేసుకునే వీలుందనన ఆమె.. అనుమానితుల జాబితా లో ఉన్న వాచ్ మన్ రంగయ్య.. పరమేశ్వర్ రెడ్డి.. ఎర్ర గంగి రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా తన అనుమానాల్ని లేఖ రూపంలో కడప ఎస్పీ కార్యాలయం లో ఆమె అందజేశారు. మరి.. సునీత సందేహాలను తీర్చేలా జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటారో?