Begin typing your search above and press return to search.
టార్గెట్ అదేనా : పవన్ ఎదిగిపోకూడదు...?
By: Tupaki Desk | 15 Jun 2022 7:41 AM GMTఏపీ రాజకీయాలు అంటే రెండు కులాలు, రెండు పార్టీలూ అన్న తీరున దశాబ్దాలుగా సాగుతోంది. దాన్ని బీటలు వార్చి మూడవ రాజకీయ పక్షాన్ని ముగ్గులోకి దించాలన్న ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నా పెద్దగా సాకారం మాత్రం కావడం లేదు. 2009 ఎన్నికల వేళ మూడవ శక్తిగా వచ్చిన ప్రజారాజ్యం పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లుగా అలా కాలగర్భంలో కలసిపోయింది. దానికి కారణం తెలుగు రాజకీయాల్లో ఉన్న అతి పెద్ద గబ్బు వల్లనే. ఎపుడూ కూడా మరో పక్షం రాజకీయంగా సవాల్ చేయకూడదు అన్న కుటిల ఆలోచనల వల్లనే ప్రజారాజ్యం నాడు అలా కనుమరుగు అయింది.
అయితే 2014 నుంచి జనసేన రూపంలో మూడవ పార్టీ ఏపీ రాజకీయలలో ఉనికి చాటుకుంటోంది. ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది. పవన్ గెలిచాడా ఓడాడా అన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాలను ఈ రోజుకూ జనసేన ప్రభావితం చేస్తోంది. ఆ పార్టీ ప్రస్థావన లేకుండా మిగిలిన పార్టీలు అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తాము బాగుపడాలన్న ఆరాటంతో పాటు ఏపీ రాజకీయ యవనిక మీద జనసేన గట్టిగా నిలబడకూడదు అన్న దారుణ వ్యూహాలు కూడా ఇతర పార్టీలలో ఉన్నాయి.
ఈ మధ్యన జనసేనాని తెలిసో తెలియకో లేక అతి ఉత్సహాం వల్లనో పొత్తుల గురించి మాట్లాడారు. అంతే టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒక్కసారిగా ఆ పార్టీ మీద ఎలా కలబడిపోయిందో అంతా చూసారు. ఇక టీడీపీకి పూర్తి మద్దతు ఇచ్చే అనుకూల మీడియా రాతలు అన్నీ కూడా ఇపుడు జనసేనకు వ్యతిరేకంగా మారడాన్ని అంతా గమనిస్తున్నారు.
జనసేనను పట్టుకుని కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన పార్టీగా చిత్రీకరించేందుకు కూడా ఒక మీడియా రాతలు సాహసించాయంటే జనసేన ఉనికి ఎంతటి అసహనం పెంచుతోందో అర్ధం చేసుకోవాలి అంటున్నారు. పవన్ ఒక నాయకుడిగా ఉన్నారు. పార్టీ పెట్టుకున్నారు. అధికారం అందుకోవాలనుకుంటున్నారు. ఇందులో ఏమి తప్పు ఉందో సదరు మీడియా వారికే తెలియాలి అని అంటున్నారు.
అక్కడికి పవన్ ఏదో కోరరాని కోరిక కోరినట్లుగా అత్యాశకు పోతున్నట్లుగా, ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకుందామనడం మహాపాపం గానూ చిత్రీకరిస్తున్నారు. ఇక పవన్ బలం కేవలం ఆరు శాతం మాత్రమే అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. 2024 నాటికి ఆ బలం పెరగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నట్లుగా అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే అధికార వైసీపీ కూడా ఎంతసేపూ జనసేనను ఒక ప్రత్యేకమైన పార్టీగా చూసేందుకు ఇష్టపడడంలేదు అనే అంటున్నారు. నిజానికి వైసీపీకి అసలైన ప్రత్యర్ధి టీడీపీ. కానీ టీడీపీ రాజకీయంతో పాటుగా జనసేనను కలిపేస్తున్నారు తప్ప సోలోగా జనసేనానిని చూసేందుకు మాత్రం వైసీపీ వారికి అంతగా రుచించడంలేదు అంటున్నారు.
తాజాగా శ్రీ సత్యసాయి జిలాల్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని మరోసారి గట్టిగా చెప్పారు. అంటే పవన్ కి రాజకీయంగా వేరే అస్థిత్వం లేదన్నది ఆయన మాటలలో భావనగా చెబుతున్నారు. పవన్ అన్న నాయకుడు రాజకీయంగా సొంతంగా కనిపించకూడదా అని జనసేన నాయకులు అయితే దీని మీద ప్రశ్నిస్తున్నారు.
ఇక అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ తమలో తాము ఎంతలా కొట్టుకుంటున్నా తమలో తాము పై చేయి సాధించాలని ఎంతలా చూస్తున్నా అది వారి మధ్యనే ఉండాల్సిన రాజకీయ పోరుగానే చూస్తున్నారు తప్ప మూడవ పార్టీ ఎంట్రీని మాత్రం సహించే సీన్ లేదని చెప్పకనే చెబుతున్నారు అంటున్నరు. అంటే ఉంటే బాబు లేకుండా జగన్ ఈ తీరుగానే ఏపీ రాజకీయాలను ఉంచాలన్న తాపత్రయం మాత్రం కనిపిస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే జనసేన తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. జనసేన తాను సొంతంగా ఎదగడానికి చూడాలి. పొత్తులు ఎత్తులు ఓట్ల చీలికలు ఇలాంటి పెద్ద పదాలను బరువైన మాటలను వాడడం కంటే తన బలాన్ని వీలైనంత వరకూ పెంచుకుంటే ఆ మీదట జరిగే పరిణామాలు జరుగుతాయని కూడా హితైషులు సూచిస్తున్నారు.
ఇక పవన్ సైతం అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్రకు సిద్ధం కావడం మంచి పరిణామంగానే చూస్తున్నారు. అటు టీడీపీ ఇటు వైసీపీలోని అసంతృప్త వాదులు, రాజకీయంగా అవకాశం లేని వారు, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు అంతా ఇపుడు జనసేన వైపు చూసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఏపీ రాజకీయం మారాలని భావిస్తున్న వారు కచ్చితంగా జనసేన వైపు చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అందువల్ల జనసేన మూడవ పార్టీగా ఏపీ రాజకీయాల్లో కొత్త ఆల్టర్నేషన్ గా ఎదగాలంటే దానికి నమ్ముకోవాల్సింది జనాలనే తప్ప పొత్తులను ఎత్తులను కానే కాదని సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో ఉన్న పార్టీలు అయితే కచ్చితంగా జనసేనకు ప్లేస్ ఇవ్వవని కూడా అంటున్నారు. అందువల్ల జనసేన ముందు ఉన్నది ఒక్కటే దారి. అదే రహదారి అని కూడా ఆ పార్టీ మేలు కోరే వారు ఇస్తున్న సలహా కూడా ఇదే.