Begin typing your search above and press return to search.

లోగుట్టు: బాబు ఇప్పుడు ఓడితే టీడీపీ ఎండ్ గేమేనా?

By:  Tupaki Desk   |   27 April 2019 4:57 AM GMT
లోగుట్టు: బాబు ఇప్పుడు ఓడితే టీడీపీ ఎండ్ గేమేనా?
X
2019 ఎన్నికలు ముగిసిపోయాయి. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా పోరాడాయి. ప్రజలు ఓటేశారు. ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా టీడీపీ మరోసారి అధికారంలోకి రావడానికి చేయని పని లేదు.. తొక్కని దారి లేదు. ఇంతలా బాబు కష్టపడడానికి కారణముందని అంటున్నాయి టీడీపీ వర్గాలు.. జగన్ తో పోలిస్తే బాబుకు మైనస్ అదే అంటున్నారు.

జగన్ వయసు నాలుగు పదుల మీదే.. ఎంతలేదన్నా ఇంకో ఇరవై ముప్పై ఏళ్లు ఆయన రాజకీయ ప్రస్థానానికి ఢోకాలేదు. చంద్రబాబు వయసు ఇప్పుడు 70 ఏళ్లు .. ఇప్పుడు ఓడితే మరో సారి ఎన్నికలు రావాలంటే 2024 రావాలి. అంటే ఈ ఐదేళ్లలో బాబు వయసు 75 ఏళ్లు అవుతుంది. వయోభారం వేధిస్తుంది. వయసు మీద పని ఏ పని చేతనవుతుందో లేదో.. అందుకే ఈ ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దింపారు బాబు. లోకేష్ రాజకీయంగా ధృడంగా తయారవ్వడానికి టీడీపీ పగ్గాలు చేపట్టడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ గెలిస్తే ఓకే.. గెలవకపోతే మాత్రం టీడీపీ భవిష్యత్ అంధకారంలో పడడం ఖాయమని టీడీపీలో ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.

చంద్రబాబు ఇంకో ఐదేళ్లు లేదా పదేళ్లు మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉండగలరు. ఆయన వయసు పెరగడం.. వృద్ధాప్యంతో ఇంత చురుగ్గా ఉంటారన్న గ్యారెంటీ లేదు. 75 వచ్చినా అప్పటికీ 50 ఏళ్ల జగన్ తో పోటీపడడం అంటే సాధ్యం కాని ముచ్చట. అందుకే వస్తే టీడీపీకి అధికారం ఇప్పుడే రావాలి. ఈ ఐదేళ్లు ‘సంతృప్తి’గా ఏపీ రాజ్యమేలి తదనంతరం ఓడిపోయినా రెస్ట్ తీసుకోవచ్చని బాబు భావిస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ స్టామినా ఉంటే గద్దెనెక్కుతారు లేదంటే వైసీపీయే కొనసాగుతుంది. అందుకే 2024 కంటే కూడా ఈ ఎన్నికలనే టీడీపీ జీవన్మరణ సమస్యగా పోరాడింది. బాబు కూడా తన వయోభారం గుర్తుకువచ్చి 2024 వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోనని మరోసారి సీఎంగా కొనసాగేందుకే కష్టపడ్డారు. అయితే ఓటర్లు మాత్రం ఎవరికి ఓటేశారన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

*లోకేష్ స్టామినా మీద టీడీపీ నేతలకు డౌటే..
ఒకవేళ ఈ ఎన్నికల్లో లోకేష్ నెగ్గి.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పగ్గాలు చంద్రబాబు నుంచి చేజిక్కించుకున్నా కానీ.. బాబులా జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో పోల్ మేనేజ్ మెంట్, నాయకత్వం చేసేంత పర్ ఫామెన్స్ లోకేష్ చూపిస్తాడన్న ఆశలు టీడీపీలో లేవు. ఎందుకంటే లోకేష్ ప్రచారంలో, జనంలో చేస్తున్న తప్పటడుగులు చూశాక ఆయన నాయకత్వ పటిమపై అందరికీ సందేహాలు వస్తున్నాయి. బాబు వయోభారంతో వైదొలిగితే అసలు లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ నేతలు ఒప్పుకుంటారా లేదా అన్నది పెద్ద సమస్యగా మారిందంటున్నారు.

బాబు గెలిస్తే ఈ ఐదేళ్లు ఆయనకు ఢోకా లేదు. కానీ ఓడిపోతే మాత్రం 2024లో అప్పటి అధికార వైసీపీని, బాబు వయోభారాన్ని తట్టుకొని టీడీపీని లీడ్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు.లోకేష్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే.. ఈ లెక్కన టీడీపీకి 2024 ఎండ్ కార్డ్ పడినట్టేనని.. టీడీపీని ఎవరైనా హైజాక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదనలు టీడీపీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.