Begin typing your search above and press return to search.
ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ తో టీడీపీ గ్రాఫ్ పెరిగిందా...?
By: Tupaki Desk | 14 Dec 2022 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ ఊపిరి అంతా చంద్రబాబులో ఉంది. ఆయన పార్టీ ఎంతటి ఇబ్బందులలో ఉన్నా నడిపిస్తున్నారు. ఏడు పదులు దాటిన వయసులో పంటి బిగువున పార్టీని భుజాల మీద మోస్తున్నారు. తెలుగుదేశం అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటే ఎన్నో కీలకమైన పదవులు చేపట్టిన వారు ఓడాక సైడ్ అయిపోయినా పార్టీని పట్టుకుని బాబు ఎదురీత ఈదుతున్నారు.
అయితే బాబుకు పార్టీ జనాల సహకారం, జనాల సహకారం ఏ మేరకు ఉంది అన్నదే చర్చగా ఉంది. బాదుడే బాదుడు అంటూ ఎనిమిది నెలల క్రితం టీడీపీ ఆర్భాటంగా కార్యక్రమం చేపట్టింది. ఇది నిజానికి జనాల్లోకి దూసుకుపోవాల్సిన కార్యక్రమం. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. నాయకులు ఎక్కడికక్కడ తూతూ మంత్రంగా జరిపించి మమ అనిపించేశారు అన్న విమర్శలు వచ్చాయి.
బాదుడే బాదుడు అనుకుంటూ చంద్రబాబు ఆనాడు ఊరూరా తెర తిరిగారు. ఆయన వెంట తిరిగిన పార్టీ జనాలు ఆయన అలా వెళ్ళగానే ఇలా ఇళ్ళకు వెళ్లిపోయారు తప్ప కంటిన్యూ చేయలేదు అని కూడా పసుపు పార్టీలో చర్చ సాగింది. అది అయిపోయింది. ఇపుడు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ మరో కార్యక్రమాన్ని టీడీపీ తీసుకుంది. ఇది కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుని బాబు జనాల్లోకి మళ్లీ వచ్చారు.
ఆయన జిల్లాల టూర్లు చేస్తున్నారు. యధా ప్రకారం ఆయన వస్తే వెంట ఉండే పార్టీ నేతలు ఆ జిల్లా దాటగానే తమ సొంత పనుల్లో పడుతున్నారు అని అంటున్నారు. ఇక మొక్కుబడిగా నియోజకవర్గాల స్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు పెద్దగా ఫోకస్ కావడంలేదు. జనాలు కూడా ఎక్కువ మంది కనిపించడం లేదు. బ్యానర్లు పట్టుకుని కొంత సేపు నినాదాలు ఇచ్చి ఊరుకుంటున్నారు.
ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్నది ఎందుకో చెప్పాలంటే ఊరూరా తిరగాలి. పల్లె పల్లెకూ వెళ్ళి తలుపు తట్టాలి. కానీ అలా జరగడంలేదు అని తెలుస్తోంది. దీని మీద రీసెంట్ గా బాబు సైతం నేతల తీరు మీద మండిపడ్డారని అంటున్నారు. పార్టీ ఇబ్బందులో ఉంటే కూడా పట్టించుకోవడం లేదని పైగా తన మీద టికెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు అంటూ బాబు బరస్ట్ అయిన వీడియో ఒకటి లీక్ అయి బయట వైరల్ అవుతోంది.
టీడీపీ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ గా చెప్పుకున్న బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు జనాల్లో కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది అంటున్నారు. చంద్రబాబు టూర్లలో కూడా అదే సన్నివేశం కనిపిస్తోంది. నిజానికి వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అంటున్న ఈ దశలో ఎన్నికలు ఏడాదిన్నర వ్యవధిలో మాత్రమే ఉన్న టైంలో జనాల్లో మార్పు కచ్చితంగా కనిపించాలి.
కానీ అనుకునంత స్థాయిలో ఈ కార్యక్రమాలు హిట్ కాలేదు అన్న చర్చ అయితే పార్టీలో ఉంది. అదే టైం లో టీడీపీ గ్రాఫ్ కూడా పెద్దగా పెరిగింది లేదు అన్న చర్చ కూడా సాగుతోంది. బాబు కాలికి బలపం కట్టుకుని తిరిగుతున్నా నేతలు జనాన్ని కదిలించే పనిలో విఫలం కావడం వల్లనే ఎంతటి ప్రెస్టేజ్ ప్రోగ్రాం ని డిజైన్ చేసినా అవి సరైన రిజల్ట్ ని ఇవ్వడంలేదు అంటున్నారు. మరి టీడీపీ అంటే దూకుడు. టీడీపీ అంటేనే చెడుగుడు. అలాంటి టీడీపీకి ఇపుడు ఏమైంది అన్న చర్చ పార్టీలో ఒక వైపు సాగుతోంది.
మరో వైపు జనాలు ఎందుకు వెల్లువలా కదిలి రావడంలేదు, ప్రభుత్వ వ్యతిరేకత విశ్వరూపం ఎందుకు దాల్చడం లేదు అన్న బాధ ఆవేదన అయితే టీడీపీ వ్యూహకర్తలలో ఉంది. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. కానీ గేర్ మార్చినా స్పీడ్ పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.