Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ఛాన్స్‌.. టీడీపీ గెలిచేనా..?

By:  Tupaki Desk   |   8 Oct 2022 8:30 AM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ఛాన్స్‌.. టీడీపీ గెలిచేనా..?
X
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంంలో అస‌లు బాగో లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీల‌క నాయ‌కుడు.. రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తంద‌ని.. భావించిన ఆయ‌న‌.. రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇత‌రత్రా స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయంగా దూకుడు చూపించ‌లేక పోయారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసేశారు. దీంతో ఆ నియోజ‌క‌వర్గంలో .. ఎమ్మెల్యే త‌ల్ల‌డిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌... నియోజ‌క‌వ‌ర్గం మొహం చూసింది లేదు. కేవ‌లం వార‌సుడిని మాత్ర‌మే రంగంలోకి దింపారు.

ఇప్ప‌టికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవ‌లం ఏడాదిన్న‌ర స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌రిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కొంత మేర‌కు శ్ర‌మిస్తే.. విజ‌యం ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి..

అదే.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. గ‌ట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వ‌చ్చాయి.

కానీ.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఏదో.. కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా పాల్గొంటున్నారు. మ‌రి ఇప్ప‌టి నుంచి ఆయ‌న పుంజుకుంటే.. ఇక్క‌డ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీలకులు చెబుతున్నారు.

వైసీపీ త‌ర‌ఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్య‌మాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయ‌న కుమారుడిని ఇక్క‌డ రంగంలొకి దింపాల‌ని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. మ‌రి ఈ స‌మ‌యంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.