Begin typing your search above and press return to search.
తెలంగాణలో 'సీనియర్ల'లో కలవరం.. తేల్చేసుకుంటారట!!
By: Tupaki Desk | 5 Sep 2022 5:05 AM GMTతెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లోనూ సీనియర్లలో కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడం.. మారుతున్న పార్టీల వ్యూహాలు.. వారిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని.. ప్రధాన మైన బీజేపీ, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. అయితే.. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నా.. అధికార పార్టీ టీఆర్ ఎస్ వ్యూహాలను బట్టి.. మిగిలిన రెండు పార్టీలూ.. దశ-దిశ మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
దీంతో అధికార పార్టీ ఎలా ముందుకు సాగుతోందనే విషయంపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కూడా కూపీ లాగుతున్నాయి. వారి వారికి ఉన్న మార్గాల ద్వారా.. టీఆర్ ఎస్ ఎలా ముందుకు సాగుతోందనే విషయం పై ఈ రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. టీఆర్ ఎస్ విషయానికి వస్తే.. తెలంగాణలో ఇప్పటి వరకు చేయించి న సర్వే లెక్కల ప్రకారం.. యువతకు అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్ దాదాపు గా ఒక నిర్ణయానికి వచ్చారని.. ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్లకు సగం సీట్లు.. యువతకు సగం సీట్లు ఇవ్వడం ద్వారా.. అసంతృప్తిని తగ్గించడంతోపాటు.. పార్టీలో నూతనోత్తేజం తీసుకువస్తే.. తప్ప.. మూడోసారి ముచ్చటగా అధికారం దక్కే పరిస్థితి లేదని.. గులాబీ బాస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి.. యువతను ఆయన ఎక్కువగా చేరదీసే పరిణామాలు కనిపిస్తున్నాయి. పైగా.. ఇది భవిష్యత్తులో కేటీఆర్‌కు కీలక పదవిని అప్పగించినా.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. యువశక్తి తోడుగా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇంతలో.. ఈ విషయం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారింది. టీఆర్ ఎస్ కనుక యువతకు పెద్దపీట వేస్తే..తాము కూడా ఇదే పంథాలో ముందుకు సాగాలని.. ఈ రెండు పార్టీలు దాదాపు నిర్ణయానికి వచ్చాయి. ఫలితంగా 50 ఏళ్లు పైబడిన వారినిపక్కన పెట్టేసే యోచన ఉందని.. బలమైన నియోజకవర్గాలు తప్ప.. ఇతర నియోజకవర్గాల్లో యువతకు పెద్దపీట వేయాలనేది ఈ రెండు పార్టీల నిర్ణయంగా ఉందని తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది.
ఇప్పుడు ఈ విషయమే సీనియర్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసినా.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో.. ఏమో.. తమకు టికెట్లు దక్కుతాయో.. లేదో .అనే బెంగ వారిని పట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. మరికొందరు మాత్రం ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 25 శాతం సీట్లు ఇస్తే.. చాలని.. సీనియర్లను కాదంటే.. మొదటికే ప్రమాదమని..కొన్ని సంకేతాలను ప్రచారంలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ.. పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయో.. అనే బెంగ మాత్రం సీనియర్లను వీడక పోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.