Begin typing your search above and press return to search.
జయలలిత వారసుడు.. వచ్చేస్తున్నాడు..
By: Tupaki Desk | 9 Sep 2018 10:34 AM GMTతమిళనాట రాజకీయ శూన్యతను అందిపుచ్చుకునేందుకు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట పెద్ద దిక్కును కోల్పోయారు. ఇక సినీ నేపథ్యమున్న కరుణానిధి కూడా కాలం చెల్లడంతో ఇప్పుడు నడిపించే లీడర్ కోసం జనం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తమిళనాట సినిమా, రాజకీయాలు అంతా కలిసే ఉంటాయి. నాటి ఎంజీఆర్ నుంచి నేటి జయలలిత , కరుణానిధి వరకూ అంతా సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారే.. అందుకే ఇప్పుడు కమల్ - రజినీ కూడా రాజకీయాల్లోకి వచ్చినా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేక.. సగం సినిమాలు.. సగం రాజకీయాలు అంటూ కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరో తమిళనాడు రాజకీయాలను శాసించేందుకు వస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
తమిళనాట జయలలిత ఫుల్ మాస్ లీడర్.. జయ మరణించాక ఆమె వారసుడిగా స్టార్ హీరో అజిత్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ అజిత్ రాజకీయాల వైపు చూడకపోవడంతో అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు అమ్మ లోటును భర్తీ చేయడానికి మరో స్టార్ హీరో దళపతి విజయ్ రహస్యంగా రాజకీయ అడుగులు వేస్తున్నట్టు తమిళనాట వార్తలొస్తున్నాయి. విజయ్ త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించడానికి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయ్ తమిళనాట మాస్ హీరో.. వరుస బక్సాఫీస్ హిట్స్ తో ప్రజల్లో బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల వచ్చిన రాజకీయ పరమైన స్టోరీ ‘మెర్సల్’ ఘనవిజయం సాధించడంతోపాటు విమర్శలు కొనితెచ్చుకుంది.. ఈ సినిమాతోనే రాజకీయ నాయకుడిగా విజయ్ సూటవుతాడని అంతా భావించారు. విజయ్ తండ్రి కూడా తన కుమారుడు విజయ్ లో రాజకీయ లక్షణాలు ఫుష్కలంగా ఉన్నాయంటూ కొనియాడారు.
ప్రస్తుతం విజయ్ మురగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మధ్యలోనే రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నట్టు చెన్నై ఫిలిం వర్గాల నుంచి లీక్ అయ్యింది. దీంతో త్వరలోనే విజయ్ తమిళనాడు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి జయలలిత లోటును ఈ స్టార్ హీరో భర్తీ చేస్తాడా లేదా అన్నది..