Begin typing your search above and press return to search.
ఆ సీఎంది ఐరెన్ లెగ్గా?
By: Tupaki Desk | 25 Oct 2019 7:28 AM GMTకీర్తిప్రతిష్టలు లేకున్నా ఫర్లేదు కానీ అపకీర్తి అస్సలు రాకూడదు. అందునా.. సెంటిమెంట్లకు సంబంధించినవంటే అంతకు మించిన వేదన మరొకటి ఉండదు. అందులోనా రాజకీయాల్లో నమ్మకాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి చోట సెంటిమెంట్లను టచ్ చేసే విషయాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కు మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదు.
తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
తాను ప్రాతినిధ్యం వహించే లింగాయత్ కమ్యునిటి ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లిన ఆయన.. పెద్ద వయసులోనూ అలుపెరగక ప్రచారం చేశాచు. ఫలితం రాకున్నా ఫర్లేదు కానీ పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే ముద్ర ఇప్పుడాయన మీద పడింది.
అదేమంటే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప ఏ నియోజకవర్గాలకు వెళ్లారో.. వెళ్లిన ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారట. లింగాయతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లోని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లుగా చెబుతున్నారు.
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ప్రచారం చేసిన ఆయన.. సుడిగాలి పర్యటన చేశారు. కొల్హాపుర.. సాంగ్లి.. సల్లాపుర జిల్లాల్లో ఆయన ప్రచారం చేశారు. కర్ణాటక సరిహద్దు జిల్లాలుగా ఉండే ఈ నియోజకవర్గాల్లో లింగాయతులు ఎక్కువగా ఉంటారు. యడ్డి కానీ ప్రచారం చేస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని ఆశించారు.
అదేం దరిద్రమో కానీ.. ఆయన ప్రచారం చేసిన ప్రతిచోటా బీజేపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. దీంతో.. ఇప్పుడు ఆయనకు కొత్త కష్టం వచ్చి పడిందంటున్నారు. కష్టపడిన దానికి ఫలితం దక్కకున్నా ఫర్లేదు.. ఐరెన్ లెగ్ అన్న ఇమేజ్ రావటాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.