Begin typing your search above and press return to search.
ఏపీలో మంత్రి మండలి నుండి నెక్ట్స్ కోటాలో ఆ మంత్రి ఆల్మోస్ట్ అవుట్ ?
By: Tupaki Desk | 2 March 2021 4:35 AM GMTహమ్మయ్య! మంత్రి పదవి ఇచ్చారు.. మనమంటే జగన్ కి చాలా స్పెషల్ !! అనుకునే వారికి షాకిస్తున్నారు సీఎం జగన్. తను ఎంత నమ్మినా.. మంత్రులపై ఆయన ఓ కన్నేసి ఉంచుతున్నారు. మంత్రుల బాడీ లాంగ్వేజ్ నుంచి వారి మాట తీరు, వ్యవహారాల వరకు సీఎం అన్ని కోణాల్లో కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దేవదాయ శాఖపై మరింతగా `నిఘా` పెట్టినట్టు వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నారు. ఆలయాలపై దాడులతో ప్రభుత్వం ఇరుకున పడింది. అయితే.. దీని నుంచి బయటపడేందుకు అంతే వేగంగా చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఆయన విషయాన్ని సరైన విదంగా డీల్ చేయలేకపోయారనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపించింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నోటిని అదుపు చేయడంలో ఆయన సక్సెస్ కాలేక పోయారు. ఈ నేపథ్యానికి తోడు మీడియా ముందు కూడా ఆయన దీనిని సరైన విధంగా తీసుకువెళ్లలేకపోయారనే భావన సీఎం లోనూ ఉందని తెలిసింది. దీంతోఎంత క్లోజ్ అయినప్పటికీ.. వెలంపల్లిపై ఒకింత అసంతృప్తితో ఉన్నారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదేసమయంలో మంత్రి తన వారికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వం పనులు అప్పగించడం పైనా జగన్ ఆరాతీసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని చెప్పిన మంత్రుల జాబితాలో తొలిపేరు వెలంపల్లిదే ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే చాలా మంది మంత్రులు అలెర్ట్ అయినట్టు సమాచారం. తమపైనా సీఎం జగన్ నిఘా ఉంచారేమో.. అని వారు వాకబు చేస్తున్నారు. ఎవరికి వారు తమ పనితీరును ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అయితే.. ఇప్పటికే తనకు సంబంధించి శాఖ వివరాలపై అధికారులతో తరచుగా చర్చిస్తున్నారు. తాను చేసిన డెవలప్ మెంట్లు ఎన్ని ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వారిలో ఒకరు కూడా ఇదే పనిచేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్ తమకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొనే వారంతా అలెర్ట్ కావడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.